నవాబ్‌పేట, డిసెంబర్ 30 : వారిద్ద రూ గాఢంగా ప్రేమించుకున్నారు.. జీ వితాంతం కలిసే బతకాలని నిర్ణయించుకున్నారు.. కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు.. క్షణికావేశంతో ఒకరి తర్వాత ఒకరు తనువు చాలి ంచి మృత్యువులోనూ వీడని ప్రేమబంధంగా నిలిచిన ఘటన నవాబ్‌పేట మండలంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. కాకర్లపహాడ్‌కు చెందిన చాకలి అంకిత(18) జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా కాళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చు దువుతుండగా.. అదే గ్రామానికి చెందిన చందుకుమార్(20) జిల్లా కేంద్రంలోని వాసవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
వీరిద్దరూ గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఏమి జరిగిందో తెలియదు కానీ ఆదివారం సాయంత్రం అంకిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న చందు తీవ్రంగా కంగారు పడ్డాడు. ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయి మృతి చెందిందని, ఇక నేను కూడా బతకలేనని ఆత్మహత్య చేసుకున్నాడో.. లేక అమ్మాయి తన వల్లే మృతి చెందిందనే.. అపవాదు తనపై వేస్తారనుకున్నా డో తెలియదు.
కానీ అదే రోజు రాత్రి అందరూ నిద్రకు ఉపక్రమించిన తర్వా త గ్రామ శివారులోని ఒక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చే సుకున్నాడు. తెల్లారే సరికి ఇద్దరూ మృతి చెందారనే విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులంతా నివ్వెరపోయారు. బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని పలువురు వాపోతున్నారు. కాగా ఈ ఘటనపై ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ ఇద్దరి కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ప్రేమ వ్యవహారంతోనే ఇలా జరిగిందని ఇవ్వలేదని ఎస్సై వివరించారు. ఈ ఘటనపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం వివరించారు.