మూసాపేట, ఆగస్టు 21 : మండలంలోని వేములకు ఈ నెల 5న టాటా సుమోలో 10 మంది వచ్చారు. గ్రామంలో ప ర్యటిస్తూ ‘జేబీ హోమ్స్ నీడ్స్’ పే రుతో స్పెషల్ డిస్కౌంట్ ద్వారా రూ.3,600 కడితే మీకు మూడు సబ్బులు ఇస్తామని, ఆ సబ్బుల్లో ఒక చీటి ఉంటుందని, ఆ చీ టీలో 10 రకాల వస్తువులు మిక్సీ, వంటపాత్రలు ఉంటాయని చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆశతో డబ్బులు క ట్టారు. వేములకు చెందిన రమేశ్‌కు స్కూటీ వచ్చిందని చెప్పి పేవర్ అందజేశారు.
కొన్ని డబ్బులు కడితే స్కూటీని ఇస్తామన్నారు. దీంతో అతడు 95020 42238 మణికంఠ అనే వ్యక్తికి ఫోన్ పే ద్వారా, నగదుగా కలిపి మొత్తం రూ.3,600, త ర్వాత బండి కలర్ సెలెక్ట్ చేసుకోవాలని రూ.6వేలు, స్కూటీని డీసీఎం లో ఎక్కిస్తున్నాం మిగతా డబ్బలు కట్టాలని రూ.7,500 ఒకసారి, రూ.3,600 మరోసారి ఇలా రూ.20,700లు కట్టించుకున్నారు. 15మంది వరకు డబ్బులు కట్టినట్లు బాధితులు వాపోయారు. అలాగే తుంకినీపూర్లో ఈనెల 9న అదే వాహనంలో వచ్చిన వారు 15 మందితో డబ్బులు వసూలు చేశారు.
వెంకటేశ్ అనే యువకుడికి స్కూటీ వచ్చిందని, డబ్బులు కడితే స్కూటీ ఇస్త్తామని చెప్పగా, వెంకటేశ్ అతడి తండ్రి అకౌంట్ నుంచి 9502042238 మణికంఠ అనే ఫోన్ పేకు రూ.3,600 ఒకసారి, రూ.6వేలు మరోసారి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిపారు. స్కూటీని చూపిస్తున్నామని 9000199787 నెంబర్ (ప్రకాశ్)కుపంపించాలని చెప్పడంతో రూ.6వేలు పంపించాడు. అదే గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు టీవీ వచ్చిందని రూ.8,500లు వేయించుకున్నారు. ఇలా డబ్బులు వసూలు చేసి మళ్లీ ఫోన్ చేస్తే కలువకుండా పరారైనట్లు బాధితులు తెలిపారు. కాగా, ఈ మేరకు బాధితులు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.