మన్యంకొండ క్షేత్రం భక్తఝరిని తలపించింది. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా వెంకన్న స్వామిని దర్శించుకునేందుకుభక్తులు తరలివస్తున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లు, ప్రత్యేక వాహనాల్లో వేలాదిగా తరలివచ్చారు. దీంతో జాతర ప్రాంగణం జనసంద్రమైంది. గోవింద నామ స్మరణ మార్మోగింది. పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మట్టి కుండల్లో దాసంగాలు సిద్ధం చేసి స్వామికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లు నిండిపోగా.. గంటల తరబడి దర్శనం కోసం బారులుదీరారు. వెంకన్న దర్శనంతో తన్మయత్వం చెందారు.
పాలమూరు, ఫిబ్రవరి 5: పేదల తిరుపతి లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారు నిత్యసేవలు, ప్రత్యేక పూజలందుకుంటున్నారు. ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకొని దర్శనానికి భక్తులు వేలాదిగా తరలొచ్చారు. దీంతో ఆ లయ ప్రాంగణం, చుట్టూ కొండ పరిసరాలు గోవిందనామస్మరణతో మార్మోగింది. ఉమ్మడిజిల్లా నుంచే కా కుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తు లు భారీగా వచ్చారు. ముందుగా భక్తులు స్వామివారి కోనేరులో స్నానమాచారించి దర్శనానికి వెళ్లారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లోనే ఎక్కువ సమ యం వేచిఉన్నారు.
ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం సోమవారం తెల్లవారుజామున నిర్వహించడం తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎడ్లబండ్లు కట్టుకొని కుటుంబసమేతంగా బ్రహ్మోత్సవాలకు వచ్చారు. కొంతమంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామికి మొ క్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా ఆలయ పర్యవేక్షకులు నిత్యానందచారి చర్యలు తీసుకున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యం లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మాడవీధుల్లో వివి ధ రకాల సర్కస్, సినిమాహాల్స్, తినుబండారాల గుడారాలు వందల సంఖ్యలో వెలిశాయి. లక్ష్మీవేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్, సేవాభారతి ఆధ్వర్యంలో భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్త అళహరి మధుసూదన్కుమార్, ఈవో శ్రీనివాసరాజు, పాలకమండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.