జమకాని రుణమాఫీ
ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షలోపు ఉన్న రుణమాఫీ పథకం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇందులో వివిధ రకాల సమస్య లు ఉత్పన్నమవుతుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
- ఐవోబీలో సాంకేతిక లోపం
- 1,100 అకౌంట్లకు అందని డబ్బు
- 15 రోజులు తప్పదంటున్న బ్యాంకర్లు
- అయోమయంలో అన్నదాతలు
వనపర్తి, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్షలోపు ఉన్న రుణమాఫీ పథకం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇందులో వివిధ రకాల సమస్య లు ఉత్పన్నమవుతుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పైపై న రుణమాఫీ వ్యవహారం ఆహో.. ఓహో అ ని చెబుతున్నా కిందిస్థాయిలో చూస్తే.. రైతులకు నిద్రపట్టడం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా అర్హతల మేరకు ఉన్న రైతులకైనా వారి బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అయ్యి ఉంటే, ఇంత గందరగోళం ఉండేది కాదు.
వాస్తవ పరిస్థితులను చెప్పేందుకు అధికార యంత్రా ంగం సైతం ఒకరిపై ఒకరు దాటవేస్తూ రైతాంగాన్ని మరింత కంగారెత్తిస్తున్నారు. దీంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నా రు. జిల్లాలో మొత్తం 56 బ్యాంకులు ఉండగా 1,17, 220 అకౌంట్ల ద్వారా రైతులకు పంట రుణాలిచ్చారు. వీటిలో లక్ష రూపాయలలోపు రుణమున్న 29,613 అకౌంట్లకు రూ.156.92 కోట్లను మొదటి దశలో రుణమాఫీని వా రం కిందట ప్రభుత్వం ప్రకటించింది.
ఐవోబీలకు చేరని మాఫీ..
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు రైతు రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇంకా జమకాలేదు. మిగిలిన బ్యాంకులకు రుణమాఫీ డబ్బులు జమ అయినప్పటికీ జిల్లాలోని రెండు ఐవోబీ బ్రాంచీలకు నిధులు జమకాకపోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇతర బ్రాంచీల్లోనూ కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం అసలు నిధులే ఇప్పటి వరకు జమ కాకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. జిల్లాలోని వీపనగండ్ల, వనపర్తి కేంద్రాల్లో ఇండియ న్ ఓవర్సీస్ బ్యాంక్‌లు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో దా దాపు లక్షలోపు రుణమున్న రైతులు, మాఫీ పథకంలోకి వచ్చే రైతుల అకౌంట్లు దాదాపు 1100 వరకు ఉన్నాయి. ఇందులో రూ.5 వేలు మొదలుకొని లక్షలోపు అప్పున్న రైతులు మాత్రమే ఉన్నారు. అయితే ఈ లెక్కన ఈ అకౌంట్లకు రూ.కోటీ 70లక్షలు రుణమాఫీ కింద ఈ రెండు బ్యాంకులకు చేరాల్సి ఉంది.
15 రోజులు ఆగండి..
రెండు నెలల నుంచి రెండు రూ.లక్షలలోపు రుణమాఫీ పథ కం ప్రచారం ఉధృతంగా సాగుతున్నది. దీనిపై రైతులు గంపెడాశలతో కంట్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేల కు ఈ నెల 18న ప్రభుత్వం అట్టహాసంగా రుణమాఫీని మొ దలు పెట్టిన సంగతి విధితమే. ఇందులో ఏర్పడ్డ అనేక సమస్య ల వల్ల మాఫీ నిధులు రాక రైతులు అల్లాడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రెండు ఐవోబీ బ్యాంకుల్లో నిధులు జమ కానందున రైతులంతా బ్యాంకులకు వెళ్లి ఆరా తీస్తున్నారు. వెళ్లిన రైతులకు మరో 15రోజులు ఆగాలని, సాంకేతిక సమస్య వల్ల నిధులు జమ కాలేదని, ఇందుకు సమయం తీసుకుంటుందని రైతులకు బ్యాంకర్లు చెబుతుండడంతో ఎటూ పాలుపోని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతర బ్యాంకుల్లో నిధులు జమ అయి రైతులు చక్కగా సేద్యం పనులు చేసుకుంటుంటే.. ఇక్కడ మాత్రం ఆగా లి అంటుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
రుణమాఫీ వచ్చింది కానీ..
నేను కల్వకుర్తి ఏపీజీవీబీలో తొ మ్మిది నెలల కిందట రూ.1.60 లక్షల రుణం తీసుకు న్నాను. రూ.2లక్షల రుణమాఫీ జాబితాలో నా పేరు ఉంటుందని భావించాను. ఈనెల 20 తారీఖున నా ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. మీ ఖాతాలో రూ.64,430 రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని మెసేజ్ సారాంశం. రూ.1.60 లక్ష వ్యవసాయ రుణం ఉంటే కేవలం రూ.64 వేలు మాత్రమే రుణం మాఫీ అయిందని మెసేజ్ వచ్చింది. మిగతా రూ.లక్ష రెండో విడుతలో మాఫీ అవుతుందో లేదా..అంతే సంగతులేమో చూడాలి.
– కుంభం కృష్ణయ్య, రైతు, కల్వకుర్తి
మాఫీ రాలేదు..
కల్వకుర్తి పీఏసీసీఎస్ బ్యాంకులో 2023 మార్చి 3న రూ.89,192 రుణం తీసుకున్నాను. కటాఫ్ తేదీ వరకు మిత్తిని లెక్కించినా రూ.లక్షలోపే ఉంటుంది. బ్యాంకుకు వచ్చి అధికారులను కలిస్తే.. తాము మొత్తం జాబితా పంపించాం.. మా వద్ద ఎలాంటి పొరపాటు లేదని చెప్పారు. వ్యవసాయాధికారులను కలవాలని సూచించారు. వారు ఏం చెప్తారో.. ఇంతకు రుణమాఫీ ప్రాప్తం ఉందో.. లేదో.. ఏం సర్కారో ఏమో… అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకు నాకిస్తున్నారు.
– వి. కృష్ణయ్య, రైతు, మార్చాల, కల్వకుర్తి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
సమాచారం లేదంటుండ్రు
కల్వకుర్తి పీఏసీసీ ఎస్‌లో రూ.58, 468 వ్యవసాయ రుణం తీసుకున్నా రు. 2023 డిసెంబర్ 12 నాటికి మిత్తి రూ.7,411 తో కలిపి రూ.65,879 అయ్యింది. ప్రభుత్వం ప్రక టించిన మాఫీ జాబితాలో నా పేరు లేదు. పీఏసీసీ ఎస్ అధికారులను కలిస్తే మేము పంపించాం. మా వద్ద ఏ పొరపాటు లేదు. అగ్రికల్చర్ అధికారులను సంప్రదించాలన్నారు. వారి వద్దకు వెళ్తే నా వివ రాలను తమ వద్ద ఉన్న యాప్‌లో చూస్తే నోఫౌండ్ (ఏ సమాచారం లేదని) వచ్చింది. మాఫీ కాకపోవడంతో ప్రక్రియపైనే అనుమానం వస్తుంది.
జాబితాలో నా పేరే లేదు..
కల్వకుర్తి ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘ ంలో రూ.55వేలు వ్యవసాయ రుణం తీసుకున్నా. రుణమాఫీ కటాఫ్ తేదీ వరకు మిత్తి 2,858తో కలిపి మొత్తం రూ57,858 అయ్యింది. రుణమాఫీ జాబితాలో నాపేరు రాలేదు. ఎందుకు రాలేదని బ్యాంకు అధికారులను వాకబు చేశాను. తాము జాబితా పంపించామని, తమ తప్పేమి లేదని బ్యాంకు అధికారులు చెప్పారు. వ్యవసాయాధికారులను అడిగితే తెలుస్తుందని చెప్పారు. అక్కడికి వెళితే వ్యవసాయాధికారులు ఏం చెబుతారో మరి చూడాలి.
– మస్న రవి, రైతు, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా
మాఫీ అయినా ఆనందం లేదు..
మాకు ఎకరా 20 గుంటల భూమి ఉంది. వీపనగండ్ల ఐవోబీలో రూ.60 వేలు పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం లక్ష రూపాయలలోపు ఉన్న వారందరికీ రుణ మాఫీ చేసింది. నాపేరు కూడా రుణమాఫీ లిస్టులో వచ్చింది. అయితే.. మాకు మాత్రం ఇంకా డబ్బులు పడలేదని బ్యాంకులో చెబుతున్నారు. 15 రోజుల తర్వాత రమ్మని బ్యాంకు వాళ్లు అంటున్నారు. రుణం మాఫీ అయిందని చెబుతున్నా.. మాకు ఆ ఆనందం లేకుండా పోయింది.
– ఎస్ రాణి, రైతు, అమ్మాయిపల్లి, చిన్నంబాయి మండలం , వనపర్తి జిల్లా
సాంకేతిక సమస్య వల్లే..
సాంకేతిక లోపం వల్లే రుణమాఫీ ని ధులు రైతుల బ్యా ంక్ అకౌంట్లలో జ మ కాలేదు. ఈ విష యాన్ని ఐవోబీ ప్రధాన కార్యాలయ అధికారులకు తెలియజేశాం. జీరో నుంచి మొదలైన అకౌంట్ల నెంబర్లలో చిన్నపాటి లోపం తలెత్తి ఈ సమస్య వచ్చింది. 15 అంకెలుండాల్సిన బ్యాంకు కోడ్ 14అంకెలు మాత్రమే కనిపిస్తున్నందు వల్ల సాఫ్ట్‌వేర్‌లో ఈ సమస్య వచ్చింది. ఈ సాంకేతిక సమస్యతను త్వరలోనే పరిష్కరిస్తాం. అ యితే.. అర్హత ఉన్న రైతులకు తప్పనిసరి మాఫీ వస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– భార్గవి, డిప్యూటీ మేనేజర్, ఐవోబీ, వీపనగండ్ల, వనపర్తి జిల్లా
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

