ధరూరు/కేటీదొడ్డి, జూలై 11 : కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రాకముందు ఇచ్చిన హామీలపై ప్రశ్నిద్దామని శాట్ మాజీ చై ర్మన్ ఆంజనేయగౌడ్ పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో ధైర్యం నిం పేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం గట్టు మండలకేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులతో కలిసి వెంకటేశ్నాయుడు నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అలాగే కేటీదొడ్డి మండలకేంద్రం లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ పెద్ద వ్యవస్థగా పనిచేస్తున్నదన్నారు. ఒక వ్యక్తి పోయినంత మా త్రాన పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు. అందరం కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. ప్రభుత్వ హామీలు అమలయ్యేలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడదామన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కథలు చెప్పిన కాంగ్రెస్ కేసీఆర్ హయాంలో జరిగిన రిక్రూట్‌మెంట్‌కే ప్లేస్మెంట్ ఇవ్వలేకపోతున్నదని, ఇక కొత్త్త ఉద్యోగాల మాట దేవుడెరుగని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులపై లాఠీచార్జి చేసిందని, ఓయూలో ఉద్రిక్తత నెలకొన్నదని గుర్తు చేశారు. విద్యావ్యవస్థ ను ఆగం చేసిందని ఆరోపించారు. రైతులకు రైతు భరోసా ఏదీ.. రైతు బీమా ఏదీ.. రెండు పంటలకు నీరేదీ.. ఇలా ప్రశ్నిస్తే అంతా శూన్యమే కాబట్టి కార్యకర్తలుగా మనం గట్టిగా నిలబడ దాం, ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామన్నారు.
మేమూ ఇక్కడే ఉంటాం.. కేటీఆర్ అండగా ఉంటాడు. గద్వాలలో మళ్లీ బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడిద్దామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్‌లోకి వెళ్లినంత మాత్రాన పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధైర్యపడొద్దని, మీకు మే మంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మం డిపడ్డారు. ప్రజలందరూ ఒక్కతాటిపైకి రావాలన్నారు. కేసీఆర్ పథకాలన్నీ బంద్ అయ్యాయని.., ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన గాలికి వదిలేసి ఢిల్లీకి తిరగడంతోనే సరిపెడుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ నేత బాసు హనుమంతునాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఇది ఎమ్మెల్యే బండ్లకు కూడా తెలుసని, అయి తే ఆయన స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరారన్నారు. అభివృద్ధి కోసం కాదనేది కార్యకర్తలు గుర్తించుకోవాలన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ బీఆర్ఎస్ కోసం పని చేసిన వారందరినీ మోసం చేసి ఎమ్మెల్యే తన సొంత పనుల కోసం అధికార పార్టీలోకి పో యాడన్నారు. కార్యకర్తల కోసం వెళ్లానని చెబుతున్న ఎమ్మెల్యే మాటల్లో నిజం లేదన్నారు. కేవలం కమీషన్ల కోసమే పార్టీ మా రాడన్నారు. ఆయా సమావేశాల్లో నాయకులు అంగడి బస్వరాజ్, వెంకటేశ్నాయుడు, శ్రీనివాసులు, కృష్ణ, తిమ్మన్న, టవ ర్ మక్బూల్, మోనేశ్, కుర్వ పల్లయ్య, మంద మల్లికార్జున్, కొండయ్య, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.