పాలమూరు, మే 10: మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూర్, ఇప్పలపల్లి, కోటకదిర, మాచన్‌పల్లి, పోతన్‌పల్లి, రాంచంద్రపూర్, ధర్మాపూర్, మాచన్పల్లితండా, జమిస్తాపూర్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలించాలని గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మాజీ సర్పంచులు రాంచంద్రయ్య, శ్రీకాంత్‌గౌడ్, రాణెమ్మ, వెంకటయ్య, సత్యమ్మ, మల్లురమ్య, మల్లికార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్ర చా రం నిర్వహించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, ఆంజనేయులు, రాఘవేందర్‌గౌడ్, మస్తాన్ పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), మే 10 : అడ్డాకులతోపా టు కాటరవం గ్రామంలో అడ్డాకుల జెడ్పీటీసీ నల్లమ ద్ది రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని ఉపాధి కూలీలను కలిసి అభ్యర్థించారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, మే 10 : మండలంలోని అచ్చాయిపల్లి, నిజాలాపూర్ తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. అచ్చాయిపల్లి, చక్రాపూర్‌లో ఉపాధి కూలీలను కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో యూత్ మండలాధ్యక్షుడు చంద్రశేఖ ర్, మాజీ సర్పంచ్ రఘురాములు, బాలన్న, యాద య్య, మలేశ్, రాజు పాల్గొన్నారు.
దేవరకద్రలో..
దేవరకద్ర, మే 10 : మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకు లు ప్రచారం చేశారు. జీన్గురాల ఎంపీటీసీ తిరుపత య్య, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి ఇంటింటికీ తి రిగి మన్నెకు ఓటేయాలని అభ్యర్థించారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, మే 10 : మున్సిపాలిటీ పరిధిలోని వా ర్డుల్లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ శుక్రవారం ప్రచారం చేశారు. కొత్తూర్‌లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎం పీపీ సత్తూర్ చంద్రశేఖర్‌గౌడ్, మాజీ సర్పంచులు నా రాయణగౌడ్, నర్సింహాగౌడ్, సత్యనారాయణ, వెంకట్రాములు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దు
ఊట్కూర్, మే 10: కాంగ్రెస్ మాయమాటలు న మ్మొద్దని మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా శు క్రవారం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, తరుణ్, నరేశ్, ప్రేమ్ సుధాకర్, శివారెడ్డి, ఆసిఫ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అన్నివర్గాలకు పథకాలు
రాజాపూర్, మే 10: కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని డీసీఎంస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా తిర్మలాపూర్, నర్సంపల్లితండాలో నమూన బ్యాలెట్ బాక్స్‌తో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కార్యక్రమంలో యూత్వింగ్ మండల అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ సర్పంచులు రామకృష్ణాగౌడ్, మహిపాల్‌రెడ్డి, పుల్లారెడ్డి, చంద్రయ్య, విష్ణు, నర్సింహులు, శ్రీనివాస్, రవి, సత్యం పాల్గొన్నారు.
జోరుగా బీఆర్ఎస్ ప్రచారం
కోస్గి, మే 10 : బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోస్గి మండలంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శు క్రవారం కోస్గిలోని సర్జఖాన్పేట్లో కొడంగల్ ఎన్నిక ల ఇన్చార్జి , మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శాసం రా మకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. కార్యక్రమంలో రాజు, మధు, బాలరాజు గౌడ్, ఇవ్వయ్య, శ్రీనివాస్, రాములు, అంజి ఉన్నారు.