వనపర్తి టౌన్, జూలై 7 : రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు 10 గంటలు పనిచేయాలని జీవోనెంబర్ 282ను విడుదల చే యడం దుర్మార్గమని సీఐటీయూ కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోషే అన్నారు. జి ల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 282ను సీఐటీయూ-ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గంధం మదన్ అధ్యక్షతన సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు కోసం జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కార్మికులకు సిద్ధమవుతుంటే పుండు మీద కారం చల్లినట్లు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 282 జీవో విడుదల చేయడం, 10గంటలు పనిచేయాలని నిర్ణయించడం సరి కాదన్నారు. 130సంవత్సరాల కిందట పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని కార్పొరేట్లు, శత కోటిశ్వరులకు, కంపెనీ యజమానులకు లాభాలు చేకూర్చే లేబర్ కోడ్స్‌ను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు.
ఆ లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని అన్నారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ విధానం ఒకటని ప్రజలు అర్థం చేసుకొని తగిన గుణపాఠం చెప్పడం కాయమన్నారు. కార్యక్రమలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సీఐటీయూ జిల్లా నాయకులు కుర్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సునీత, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, సీఐటీయూ నాయకులు నందిమల్ల రాము లు, రవి, భాగ్యలక్ష్మి, శ్యామల, మహేశ్వరి, వినీల, మహేశ్వరి, బాల రాజు, పుల్లయ్య, రమేశ్, బాలపీర్, ఏఐటీయూసీ నాయకులు రమేశ్, కుర్మయ్య, మహేశ్ ఉన్నారు.
వడ్డేపల్లి, జూలై 7 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని 10గంటలకు పెంచుతూ ఇచ్చిన జీవో 282ను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రమైన శాంతినగర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో జీవో కాపీని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో దహనం చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, విజయ్‌కుమార్, రమేశ్, సీఐటీయూ నాయకులు భీమన్న, లక్ష్మన్న, మహేందర్, మహేశ్ పాల్గొ న్నారు.
పాన్‌గల్, జూలై 7: 9వ తేదీన వివిధ కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేవీపీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు భగత్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ కార్మికుల శ్రమను కార్పొరేట్ శక్తుల లాభాలకోసం పాలకులు తాకట్టు పెడుతున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్కోడ్లు తెచ్చి 8గంటల పని 12గంటలకు పెంచారని, కార్మికుల శ్రమను కార్పొరేట్ లాభాల కోసం కార్మిక చట్టాలను సవరణ చేశారని తెలిపారు. సంఘటిత, అ సంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాధాకృష్ణ పాల్గొన్నారు.
అమరచింత, జూలై 7: కార్మికుల హక్కులను కాలరాసేలా మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగులేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని జూలై 9న సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెకు ప్రతిఒక్కరూ సంఘీభావం తెలిపి విజయవంతం చేయా లని కార్మిక సంఘాల నాయకులు రాజు, రాబర్ట్, ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం వారు ఆత్మకూర్ ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు తాము మరోసారి అధికారంలోకి వస్తే కొత్తగా ప్రభుత్వ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఏటా కోటి ఉద్యోగావకాశాలను కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఉన్న ఉద్యోగులను రోడ్డున పారేసిందని మండిపడ్డారు. తక్షణమే లేబర్‌కోడ్ చట్టాలను రద్దు చేయాలని బుధవారం దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక సమ్మెలో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పెద్దఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేయాలని వారు కోరారు.
మానవపాడు, జూలై 7 : కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సివిల్ సప్లయ్ గోదాం హమాలీ కార్మికులతో సమావేశం నిర్వహించి సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని, 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 9వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయపద్రం చేయాలన్నారు. కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు రవి, రఫీ, రాజు, అల్లిపీర, పరశురాముడు, చిన్న వెంకట రాముడు, రజాక్ పాల్గొన్నారు.