కొల్లాపూర్/శ్రీశైలం, నవంబర్ 2 : తెలంగాణ టూరిజం సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకులకు వీ లుగా సోమశిల నుంచి శ్రీశైలం వరకు.., అలాగే సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ఒడిలో పడవ ప్రయాణాన్ని శనివారం ప్రారంభించారు. వాతావారణం అనుకూలంగా ఉండడడంతోపా టు క్రూయిజ్ సీటింగ్ కెపాసిటీకి సరిపడా పర్యాటకులు రావడంతో సోమశిల నుంచి లాంచీ బ యలుదేరింది.
ప్రకృతి అందాల మధ్య లాహిరి లాహిరి లాహిరిలో అంటూ శ్రీశైలం క్షేత్రానికి ప్ర యాణికులు ఆహ్లాదకరంగా వెళ్లారు. ఆరు గంటల పాటు సాగే ప్రయాణించి శ్రీశైలం పాతాళగంగకు చేరుకున్నారు. శ్రీశైల మల్లికార్జునుడి దర్శన అ నంతరం లాంచీ సోమవారం సోమశిలకు చేరుతుందని అధికారులు తెలిపారు.
అలాగే ఉద యం 11 గంటలకు సాగర్‌లో 80 మంది పర్యాటకులతో బయలుదేరిన లాంచీ సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం లింగాలగట్టుకు చేరుకున్నది. నిత్యం ఉదయం సాగర్ నుంచి శ్రీశైలం వచ్చిన లాంచ్ మరుసటి రోజు శ్రీశైలం నుంచి సాగర్‌కు తిరుగు ప్రయాణమవుతుందని అధికారులు తెలిపారు. నల్లమల ప్రకృతి అందాలను వీక్షిస్తూ కృ ష్ణానదిపై పడవ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉందని పర్యాటకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.