ఊట్కూర్, జూలై 26 : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జీ వెంకట్రామారెడ్డి ఆరోపించారు. నిర్వాసితుల సంఘం జిల్లా కమిటీ పిలుపుమేరకు శనివారం ఊటూర్ మండల కేంద్రంలో రైతులు తాసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. స్థానిక మెయిన్ బజార్ నుంచి ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లిన రైతులను పోలీసులు కార్యాలయం మెయిన్ గేట్ బయటనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పోలీసుల నడుమ కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకున్నది. ప్రతిఘటించిన రైతులు కార్యాలయం లోపలికి ప్రవేశించి గేటు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ నెల రోజులుగా భూ నిర్వాసితులు వివిధ రూపాల్లో తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, అధికారులు సైతం తాము నిర్ణయించిన భూ పరిహారం తీసుకోవాలని రైతులను ప్రలోభాలకు గురిజేయడం ఎంతవరకు సమంజసమని ఆయ న ప్రశ్శించారు. సీఎం సొంత నియోజకవర్గం లగచర్ల ఇండస్ట్రీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారంతోపాటు కంపెనీ నుంచి మరో నాలుగు లక్షల పరిహారం, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని, ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కో ల్పోయిన రైతులను ఆదుకోవడంలో మాత్రం మరో రకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్య క్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టు నిర్మాణం లో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే ముందుకు రావాలని, నిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా ప్రాజెక్టు పనులు చేపట్టరాదని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.14లక్షల పరిహారం రైతులకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా తాను స్వయంగా ప్రకటించిన పరిహారం కూడా ప్రకటించకపోవడం విచారకరమన్నారు.
జిల్లా రైతాంగం మొత్తం ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని, వాస్తవ పరిహార నిర్ధారణ కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు, మేధావులతో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, కమిషన్ నిర్ధారించిన బేసిక్ ధరకు 2013 చట్టాన్ని అన్వయించి ఎకరాకు రూ.60 లక్షలు భూ పరిహారం అందజేయాలని కోరారు. భూ నిర్వాసితులను ఆదుకునేందుకు మంత్రి వాకిటి శ్రీహరి స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిషరించాలని కోరారు. మాజీ ఎంపీటీసీ దొబ్బలి హనుమంతు, పీఏసీసీఎస్ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం వివిధ డిమాండ్ల కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్ రవికి అందజేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మరాజుగౌడ్, మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కోరం మహేశ్వర్‌రెడ్డి, రాఘవేందర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, రాంరెడ్డి, బాలరాజు, విజయభాసర్ రెడ్డి, వడ్డే పెద్ద హనుమంతుతోపాటు రైతులు పాల్గొన్నారు.
మక్తల్, జూలై 26 : పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయపరమైన పరిహారం ఇవ్వాలని, లేదంటే ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు మాత్రం అప్పగించేది లేదని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. శనివారం భూ నిర్వాసితులు మక్తల్ తాసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పేట-కొడంగల్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల భూములకు బేసిక్ ధరను నిర్ణయించేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల కమిటీ మం డల అధ్యక్షుడు మాల నర్సింహులు, కార్యదర్శి కేశవులు, సభ్యులు రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి సాగునీటిని తరలించేందుకు మక్తల్ మండలం భూత్పూర్ గ్రామ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందన్నారు.
గతంలోనే భూ త్పూర్ రిజర్వాయర్ నిర్మాణంలో కాట్రేవుపల్లి గ్రామానికి చెందిన 300 ఎకరాలు ప్రాజెక్టు ని ర్మాణంలో కోల్పోవడం జరిగి దీంతో వాటిని నమ్ముకున్న రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పేట- కొడంగల్ పథకానికి మరో 100 ఎకరాలు తీసుకొంటుండడం తో మరికొంత మంది రైతులు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.14లక్షలు కాకుండా సీఎం నియోజకవర్గంలో లగచర్ల రైతులకు ఏ విధంగా పరిహారం అందిస్తున్నారో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి సైతం అదే విధంగా న్యాయమైన పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశా రు. అనంతరం తాసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కాట్రే వుపల్లి, ఎర్నగాన్పల్లి, కాచ్వార్ తదితర గ్రామా ల భూ నిర్వాసితులు పాల్గొన్నారు.