కొల్లాపూర్, డిసెంబర్ 24 : కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ నిర్మిత ప్రాజెక్టుల కోసం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని, మైనర్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు నీటి పారుదలశాఖ, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్(తెలంగాణ సచివాలయం)లో కొల్లాపూర్ నియోజకవర్గంలో సాగునీటి పారుదలపై ఆ యా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ఆదివారం మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఎంజీకేఎల్‌ఐలో భాగంగా సింగవట్నం రిజర్వాయర్, జూరా ల ఎడమ కాల్వ పరిధిలోని గోపల్‌దిన్నె జలాశయా న్ని కలిపే లింక్ కెనాల్ పనుల పురోగతి, భూసేకర ణ లక్ష్యం ఏ మేరకు నెరవేరిందని అడిగి తెలుసుకున్నారు. సింగవట్నం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా కృష్ణానది నీటిని జూరాల ఎడమ కా ల్వ పరిధిలోని గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ను నిం పడం మూలంగా 35వేల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో లింక్ కెనాల్ పనులకు రూపకల్పన చేశారు. అయితే ఈ పనుల నత్తనడకన కొనసాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. అయి తే భూసేకరణలో జాప్యం కారణంగా పనులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసేకరణ సమస్యలపై నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారులు దృష్టి సారించి, పరిహారం సంగతి తేలితే పనులు వేగం అందుకునే అవకాశం ఉం దని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
కెనాల్ తవ్వకాల మూ లంగా భూములు కోల్పోతున్న వారంతా సన్న, చిన్నకారు రైతులేనని, వారికి సరియైన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇందుకు సంబంధించిన ప్ర తిపాదనలను వెంటనే రూపొందించి, నివేదికను స మర్పించాలన్నారు. రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన భూసేకరణ ప్రక్రియ ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, దీనిపై తాను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానని మంత్రి అ ధికారులకు వివరించారు. అలాగే 1500 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ముక్కిడిగుండం సమీపంలోని జిల్దార్తిప్ప చెరువు పనుల ప్రగతిని గూర్చి మంత్రి ఆరా తీశారు. జిల్దార్తిప్ప చెరువు నింపడానికి ప్యాకేజీ-30తో పాటు పెద్దకొత్తపల్లి మండలం బాచారం, యాపట్ల, మారెడుమాన్‌దిన్నె, జిల్దార్తిప్ప చెరువు ఆయకట్టుకు సాగునీరందించే పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాల ని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత ఉన్న చోట చెరువుల ద్వారా పూర్తిస్థాయిలో డిస్ట్రిబ్యూటర్ కింద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సాగునీరందించాలని మంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో నీటిపారుదల ఎస్ఈ విజయభాస్కర్‌రెడ్డి, ఈఈలు శ్రీ నివాస్‌రెడ్డి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.