జడ్చర్ల, ఏప్రిల్ 26: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సీ. లక్ష్మారెడ్డి జడ్చర్లలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు గులాబీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రలలో, గ్రామాలలో పార్టీ పతాకాలను ఎగరవేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.