ఆత్మకూరు, నవంబర్ 6 : పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటి ఘట్టమైన అలంకార మహోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. ఆత్మకూరు నుంచి కురుమూర్తి కొండల వరకు స్వామి వారి స్వ ర్ణాభరణాల ఊరేగింపు భారీ భక్తజనుల మధ్య సాగింది. అలంకార మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణం శోభాయమానంగా ముస్తాబైంది. ముందుగా ఆత్మకూరు ఎస్బీఐలో భద్రపరిచిన కోట్లాది విలువచేసే స్వర్ణాభరణాలను బ్యాం కు మేనేజర్ అబ్బాస్‌అలీ, క్షేత్ర అధికారి అజయ్‌కుమార్, అకౌంటెంట్ స్వాతి నేతృత్వంలో రాజకీయ నాయకుల సమక్షంలో ఈవో రఘునాథ్‌రెడ్డి లాకర్‌ను తెరిచారు. గాడి వంశస్తులు చింతకుంట గాడి బాలరాజు స్వర్ణాభరణాల పెట్టెను బయటకు తీశారు.
బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో స్వామివారి స్వర్ణాభరణాలను లాంఛనప్రాయంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం మేళతాళాలు, కుర్వడోళ్ల వాయిద్యాలతో స్వర్ణాభరణాల ఊరేగింపును ప్రారంభించారు. కళాకారులు, చిడతల భజన, కేరళ వాయిద్యకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రతినిధులు ముందు నడుస్తూ ఊరేగింపును కొనసాగించారు. పోలీసుల భారీ బందోబస్తుతో భక్తుల ఇబ్బందులు గుర్తించిన ఎమ్మెల్యే శ్రీహరి రోప్ పార్టీని తొలగించారు.
పరమేశ్వరస్వామి చెరువుకట్ట వరకు కాలినడకన సాగిన ఊరేగింపులో దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల రాజకీయ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఊరేగింపులో పాల్గొని స్వర్ణాభరణాలను దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను సాదరంగా స్వాగతించి సన్మానించారు. ఊరేగింపు పొడవునా వేలాదిగా భక్తులు స్వామి స్వర్ణాభరణాలను, పట్టువస్ర్తాలను తాకి మొక్కేందుకు పోటీపడ్డారు. శివసత్తుల పూనకాలు, గోవిందనామస్మరణలతో ఆత్మకూరు పట్టణం మార్మోగింది. పట్టణ శివారులోని పరమేశ్వరస్వామి చెరువుకట్టపై పరమశివుడి ఆలయానికి అభిముఖంగా స్వర్ణాభరణాలతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు పూజలు నిర్వహించారు. అనంతరం సీఐ శివకుమార్, ఎస్సై నరేందర్‌ల నేతృత్వంలో భారీ బందోబస్తు నడుమ స్వామివారి స్వర్ణాభరణాలను పట్ట ణం నుంచి సాగనంపారు. పోలీసుల కాన్వాయ్‌తో ప్రత్యేక వాహనంలో మదనాపురం మండలం కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపురం చేర్చారు.
అమ్మాపురం ముక్కెర రాజవంశానికి చెందిన అమ్మాపురం సం స్థానాధీశుడు రాజా శ్రీరాంభూపాల్రెడ్డి స్వగృహంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేల సారథ్యంలో భారీ భక్తసమూహంతో స్వర్ణాభరణాలను కొండపైకి చేర్చారు. ప్రధాన ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కార్యనిర్వాహక అధికారి సమక్షంలో స్వామివారి స్వర్ణాభరణాలను ప్రధాన పూజారులకు అప్పగించారు. ప్రత్యేక పూజల అనంతరం కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తిస్వామికి అలంకరించారు. స్వర్ణభూషితుడైన స్వామివారితో కాంచనగుహ స్వర్ణకాంతులతో ధగధగలాడింది.
ఆత్మకూరు సీఐ శివకుమార్ నేతృత్వంలో ఒక డీఎస్పీ, ఆరుగు ఎస్సైలు, 80 మంది కానిస్టేబుల్స్, ఒక స్పెషల్ రోప్ పార్టీ ఆధ్వర్యంలో ఆభరణాల ఊరేగింపును పోలీసులు పకడ్బందీగా నిర్వహించారు. మహోత్సవంలో ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, మదనాపురం, చిన్నచింతకుంట, దేవరకద్ర, నర్వ మండలాలకు చెందిన అన్ని పార్టీల ముఖ్య నాయకులు, అధికారులు, పా ల్గొన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గా యత్రీయాదవ్, వైస్ చై ర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృ ష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శశిధర్, నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, వర్కటం జగనాథ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నాగరాజుగౌడ్, రహమతుల్లా, మొ గిళి గంగాధర్‌గౌడ్, ప రమేశ్, శ్రీనివాసులు, వెంకటన్న, షబ్బీర్
తదితరులు పాల్గొన్నారు.
అశ్వవాహనంపై ఊరేగింపు
చిన్నచింతకుంట, నవంబర్ 6 : కురుమూర్తిస్వామికి బుధవారం అశ్వవాహన సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రధానాలయం నుంచి మోకాలుగుండు వరకు ఊరేగించారు. అలాగే స్వా మి ఆలంకారోత్సవం కనులపండువగా జరిగింది. ఆత్మకూరు నుంచి స్వర్ణాభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ కమిటీకి అప్పగించగాస్వామికి అలంకరించారు. దీం తో కాంచనగుహ ధగధగలాడింది. దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సీతాదయాకర్‌రెడ్డి, స్వర్ణసుధాకర్‌రెడ్డి స్వామిని దర్శించుకున్నారు. సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో తాసీల్దార్ ఎల్లయ్య, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
పట్టువస్ర్తాల ఊరేగింపు
అమరచింత, నవంబర్ 6 : కురుమూర్తి స్వామి ధరించే పట్టువస్ర్తాలను అమరచింత చేనేత కార్మికులు పదిరోజులు గా నియమనిష్టలతో నేశారు. బుధవారం ఈ వస్ర్తాలను భక్త మా ర్కండేయ ఆలయంలో ఉంచ గా ఎమ్మెల్యే శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం బా జాభజంత్రీలతో పద్మశాలీ సం ఘం సభ్యు లు ఊరేగింపుగా ఆత్మకూర్‌కు తరలించి అక్కడి నుంచి ఆ భరణాలతోపాటు కురుమూర్తికి తరలించి అప్పగించారు