మహబూబ్ నగర్ : ఈనెల 12న బీఆర్ఎస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పాలమూరు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) పిలుపునిచ్చారు.
శనివారం భూత్పురు మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భూత్పురు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు.
క్రీడాకారుడికి మాజీ ఎమ్మెల్యే సన్మానం

ఒడిస్సా లో నిర్వహించిన ఈఎంఆర్ఎస్ ( EMRS ) 4వ నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025 కాంపిటీషన్ లో చెస్, జిమ్నాస్టిక్ పోటీలో ప్రతిభ కనబరచిన శివ అనే విద్యార్థిని మాజీ ఎమ్మెల్యే అభినందించారు. కామారెడ్డి ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్లో 7 వ తరగతి చదువుతున్న భూత్పురు మండలం కరివెన గ్రామానికి చెందిన మాట్ల మల్లేష్ కుమారుడు శివ పోటీలలో ప్రతిభ కనబరిచి పథకం సాధించినందున అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.