గద్వాల, సెప్టెంబర్ 14 : గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ సక్సెస్‌తో గులాబీ కార్యకర్తల్లో నయా జోష్ నెలకొంది. గద్వాల నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో రామన్న స్పీచ్ జోష్ పెంచింది. రామన్న పర్యటనను అడ్డుకోవడానికి అధికార పార్టీ నేతలు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా అంచనాలకు మించి గద్వాల గర్జన సభకు పెద్ద ఎత్తున ప్రజలు, గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావడంతో అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టించింది. పార్టీకి నాయకులు ముఖ్యం కాదు కార్యకర్తలే ముఖ్యమని మరోసారి సభను విజయవంతం చేసి గద్వాల ప్రజలు చూపించారు.
నాయకులు ఉంటారు.. వెళ్లి పోతారు.. కానీ కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్మలు అని నిరూపించారు గద్వాల ప్రజలు. రామన్న స్పీచ్ వినడానికి అన్నివర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తేరు మైదానం చేరుకోవడంతో మైదానమంతా జనంతో కిక్కిరిసి పోయింది. రామన్న స్పీచ్ గులాబీ కార్యకర్తలు జోష్ నింపింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు సభలో నిలిచారంటే వారికి బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్‌పై ఎంత అభిమానం ఉందో సభను చూసిన వారికి తెలిసిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు పార్టీని వదిలి వెళ్లిపోయినా గులాబీ జెండాకు మేము అండ గా ఉంటామని నిరూపించారు గద్వాల నియోజకవర్గ ప్రజలు.
పార్టీలో పదవులు అనుభవించిన వెళ్లి పోయినా వారితో ఇక గద్వాలలో బీఆర్ఎస్ లేదనే విమర్శలు చేసే వారికి శనివారం గద్వాల జిల్లా కేం ద్రంలో గద్వాల గర్జనకు హాజరైనా ప్రజలే గులాబీ జెండాకు కార్యకర్తలు, ప్రజలు ఎంత అండగా ఉన్నా రో తేలిపోయింది. ఇక్కడి అధికార పార్టీ నాయకులు తమ చెంచాగాళ్లతో కేటీఆర్ పర్యటన రద్దు అయిందని, వర్షం కారణంగా సభ రద్దు అని సోషల్ మీడియాలో సభను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా వారి ప్రయత్నం ఫలించ లేదు.
వరుణ దేవుడే రామన్న పర్యటనకు సహకరించాడంటే, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గద్వాల రామన్న పర్యటను అడ్డుకోలేకపోయారు. అందుకు కారణం గద్వాల నియోజకవర్గంలో కరుడు గట్టిన కార్యకర్తలు బీఆర్ఎస్ జెండాకు ఉండడమే కారణం. వర్షం కురుస్తున్న ప్రజలు రామన్న స్పీచ్ వినడానికి రావడంతో గద్వాల తేరు మైదానం గులా బీ నాయకులతో గర్జించింది. గులాబీ గర్జన తర్వాత అధికార పార్టీ నేతల్లో వణుకు మొదలైంది.
జిల్లా కేంద్రంలో శనివారం గద్వాల గర్జన పేరుతో తేరుమైదానంలో సభ నిర్వహించారు. ఈ సభ ఎన్నికల సభ కాదు.. సన్మాన సభ కాదు.. గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపడానికి, కొంత మంది చేరికల కోసం సభ నిర్వహించడం, ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ సభకు స్వచ్ఛందంగా ఊహించని జనం రావడంతో అధికారపార్టీ నేతల్లో గుబులు పుట్టుకుంది.
గద్వాల గర్జన సభ గులాబీ నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్ నింపగా కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చే సింది. సమయం తక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి సహకారంతో సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు గద్వాల నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలను, కార్యకర్తలను సభకు పెద్ద ఎత్తున హాజరమ్యేలా చూశారు. వీరి పర్యటనే సభ సక్సస్‌కు ప్రధాన కారణమని చెప్పవచ్చు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు రామన్న స్పీచ్ గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపింది. తన స్పీచ్‌లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పది మంది పార్టీ మారిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విమర్శల గుప్పించారు. సిట్టింగ్‌లపై కేటీఆర్ విమర్శలు గుప్పించే సమయంలో పార్టీకి హాజరైనా జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బొంద పెడదామా అంటే పెడదాం అంటూ ప్రజలు కేటీఆర్‌కు అండగా నిలిచారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ పార్టీ మారిన నాటి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొంత నైరాశ్యం ఉండేది. వారికి అండగా నేనున్నానని బాసు హనుమంతునాయుడు ముందుకు రావడంతో కార్యకర్తల్లో కొంత మేర జోష్ వచ్చింది. అయితే రామన్న గద్వాల గర్జన సభలో మేము మీకు అండగా ఉంటాం, మీకు ఏ కష్టం వచ్చినా ముందుంటామని చెప్పడం కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇస్తూ వారిలో జోష్ నింపారు. గద్వాల ఎమ్మెల్యేపై సెటైర్లు వేసిన ప్రతి సారీ ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో కేటీఆర్ కార్యకర్తలకు మరింత జోష్‌ను నింపే ప్రయత్నం చేశారు.
కేటీఆర్ గద్వాలకు వస్తే తమ గట్టు విప్పి ప్రజల ముందు ఉంచుతాడని భావించిన అధికార పార్టీ నేతలు తమ చెంచాలతో కేటీఆర్ పర్యటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించారు. వ ర్షం కారణంగా కేటీఆర్ పర్యటన రద్దు అయిందని, ఎవరు నేతలు పార్టీలో చేరకపోవడంతో కేటీఆర్ గద్వాల పర్యటన రద్దు చేసుకున్నాడని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు. దీంతో కా ర్యకర్తలు అయోమయానికి గురయ్యారు.
అయితే బీఆర్ఎస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ పర్యటన రద్దు కాదని చెప్పడంతో కేసీఆర్ అభిమానులు, నాయకులు, గులాబీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు హాజరు కావడంతో ఇక్కడి అధికార పార్టీ నేతలకు ఇది రుచించడం లేదు. రామన్న స్పీచ్‌ను వినడానికి అంచనాలకు మించి, వర్షాన్ని సైతం లెక్క చే యక కార్యకర్తలు, ప్రజలు సభకు హాజరు కావడంతో ఇక్కడి అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో తోచడం లేదు. ఇక తమ భవిష్యత్ ముగిసినట్లేనా..? అనే ఆలోచనలో పడ్డట్టు కూడా తెలిసింది. కేటీఆర్ గద్వాలకు చేరుకోగానే అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. కిష్టారెడ్డి బంగ్లా నుంచి ర్యాలీ సభ వరకు నిర్వహించగా రామన్న వెంట ర్యాలీలో వేల మంది నడిచారు.
సభకు అనుకున్నంత మంది రారు, సభ సక్సెస్ కాదని భావించిన అధికార పార్టీ నేతలకు ఊ హించని షాక్ ఇచ్చారు గద్వాల ప్రజలు. వారి అంచనాలకు మించి సభకు ప్రజలు హాజరయ్యారు. సభ సక్సెస్ కావడంతో ఇక ఏ ఎన్నికలు వచ్చిన గద్వాల కోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమనే సంకే తం గద్వాల రామన్న పర్యటనతో తేలిపోయింది. ఏది ఏమైనా శనివారం గద్వాల గర్జన పేరుతో తేరు మైదానంలో నిర్వహించిన సభ సక్సెస్ కావడం రామ న్న గద్వాల పర్యటన గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నింపిందనే దాంట్లో ఎలాంటి సందేహాం లేదు.