మహబూబ్‌నగర్ నెట్వర్క్, జూలై 24 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఊరూవాడాలో వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో పూజలు చేశారు. కేక్ కటింగ్‌లు జోరందుకోగా.. మిఠాయిలు పంపిణీ చేశారు. దవాఖానల్లో రోగులకు, అనాథాశ్ర మాల్లో వృద్ధులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. వనపర్తిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక వేంకటేశ్వర ఆలయంలో కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ అన్నారు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజల సమస్యలను ఎండగడు తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేక్ కట్ చేశారు.
భూత్పూరు మండలం అన్నాసాగర్‌లో కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. నారాయణపేట జిల్లా మరికల్లో గులాబీ శ్రేణుల సమక్షంలో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లోని పడమటి అంజన్న స్వామికి పూజలు చేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే చిట్టెం బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గులాబీ పార్టీ నేత బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా.. 71 మంది రక్తదానం చేశారు. జిల్లా కేంద్రంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. పలు చోట్ల నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. ప్రజలతో మమేకమై.. నిత్యం సమస్యలపై ప్రశ్నించే యువనేత కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆయన వెయ్యేళ్లు వర్ధిల్లాలని పలువురు ఆశీస్సులు, దీవెనలు అందజేశారు.
మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 24 : మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, ఆంజనేయులు, శివరాజ్, దేవేందర్‌రెడ్డి, సుధాశ్రీ, గణేశ్ తదితరులు పాలొన్నారు.