జడ్చర్ల, డిసెంబర్ 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బాలరాజు, జైపాల్ యాదవ్‌కు జడ్చర్లలో పార్టీశ్రేణులు ఘనస్వాగతం పలికారు. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి తండ్రి జంగిరెడ్డి ఇటీవల మృతి చెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి విచ్చేసిన మంత్రులు గొల్లపల్లి సమీపంలోని బ్లూఫాక్స్ హోటల్ వద్ద టీ తాగేందుకు కొద్దిసేపు ఆగారు.
ఈ సందర్భంగా జడ్చర్లకు చెందిన బీఆర్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి అభిమాన నాయకులతో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. నసరుల్లాబాద్ వద్ద ప్రణీల్‌చందర్ ఆధ్వర్యంలో 150 మంది మహిళలు గుమ్మడికాయలతో స్వాగతం పలికి దిష్టితీశారు. ‘మళ్లీ మీరే రావాలి.. ఆ దేవుడి ఆశీర్వాదం మీ పైన ఉంటుంది’.. అంటూ మహిళలు ముక్తకంఠంతో అభిమానాన్ని చాటుకున్నారు.
కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మ న్ సుదర్శన్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, లత, చైతన్య, ఉమాదేవి, ఉమాశంకర్‌గౌడ్, సారిక, జ్యోతికృష్ణారెడ్డి, శశికిరణ్, మహేశ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రణీల్, రఘుపతిరెడ్డి, యాదయ్య, రామ్మోహన్, మురళిమురళి, దానిష్ పాల్గొన్నారు.