ఇటిక్యాల, ఏప్రిల్ 9 : బీచుపల్లి క్షేత్రం వద్ద ప్రవహించే కృష్ణమ్మ నీళ్లు లేక వెలవెలబోతున్న ది. ఐదారేండ్లుగా ఎన్నడూ లేనివిధంగా ప్రవా హం అడుగంటడంతో నదిలో రాళ్లు తేలాయి. రాష్ట్ర నలుమూలల నుంచి అస్థికలు నదిలో కలిపేందుకు వచ్చేవారు నీరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
కొంతమంది భక్తు లు నదిలో రాళ్లు దాటుకుంటూ కొండపేట వద్ద నదిలో గల చిన్నమడుగులో ఉన్న కాస్త నీటిలో స్నానాలు చేసి అస్థికలను కలుపుతున్నారు. రాబోవు రోజుల్లో నిర్వహించే ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, శ్రీరామనవమి, అంజన్న బ్రహ్మోత్సవాలకు నీటి కష్టాలు తప్పేలా లేవంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి షవర్బాత్కు ఏర్పాట్లు చేపడుతామని కార్యనిర్వహణ అధికారి రామన్‌గౌడ్ తెలిపారు.