ఊట్కూర్, (కృష్ణ) ఫిబ్రవరి 10 : మక్తల్ నియోజకవర్గంలోని గుడెబల్లూరు, కర్ణాటక రా ష్ట్రం దేవసూగూర్ గ్రామాల మధ్య కృష్ణానదిపై నూతనంగా నిర్మిస్తున్న ఫోర్‌లేన్ బ్రిడ్జి ని ర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగేండ్లుగా మందకొడిగా పనులు చేపడుతుండడంతో ఇటు తెలంగాణ, అటు కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగించేందుకు ప్రయాణికులపై తీవ్రమైన భారం పడుతున్న ది. కృష్ణానదిపై 750 మీటర్ల పొడవున చేపట్టిన ఈ ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణ పనులను కర్ణాటకలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రారంభించింది. రూ.150కోట్లతో క్రిషి ఇన్‌ఫ్రాటెక్‌కు పనులను అప్పగించింది. పనులను ప్రారంభించిన ఏడాదిలోపే కరోనా కారణంగా కొన్నాళ్ల పాటు బ్రిడ్జి నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసి రెండేండ్ల తర్వాత తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం నదిలో పిల్లర్, ఫియర్ క్యాప్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించే ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు మరో ఏడాది పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది నవంబర్, లేదా డిసెంబర్ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేయిస్తామని క్రిషి ఇన్ఫ్రాటెక్ ఉద్యోగి ఒకరు తెలిపారు. కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
పాత బ్రిడ్జి మరమ్మతుతో ప్రయాణికుల ఇబ్బందులు..
తెలంగాణ, కర్ణాటక సరిహద్దు శివారులోని కృష్ణానదిపై 1944 నిజాం నవాబు కాలంలో నిర్మించిన బ్రిడ్జి మరమ్మతు పనులను గత నెల 15వ తేదీన అధికారులు ప్రారంభించారు. బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలతో బీటీ రోడ్డు పలుమార్లు పాక్షికంగా దెబ్బతిన్నది. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో గతేడాది అధికారులు ప్యాచ్ వర్క్ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన కొన్ని నెలలకే తిరిగి బీటీ రోడ్డు ధ్వంసం కావడంతో తాత్కాలిక నిర్మాణం చేపట్టేందుకు క్రిషి ఇన్‌ఫ్రాటెక్‌కు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. మరమ్మతులో భాగంగా అర ఫీటు లోతు వరకు బీటీ లేయర్‌ను తొలగించి కొత్తగా సిమెంట్, కాంక్రీట్‌తో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. బ్రిడ్జిపై వేసిన సీసీరోడ్డు నెల రోజుల వరకు వాటర్ క్యూరింగ్ చేపట్టేందుకు వా హనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిషేధించారు. పెద్ద వాహనాలతోపాటు టూ వీ లర్ వాహనాలను సైతం బ్రిడ్జిపైకి అ నుమతించడం లేదు. రాకపోకలను నిషేధిస్తూ అటు కర్ణాటక, ఇటు తెలంగాణ పోలీసులు బార్డర్ చెక్‌పోస్టుల వద్ద ఇనుప కంచెలను ఏర్పాటు చేసి కాపలా కాస్తున్నారు.
వాహనాల దారి మళ్లింపు..
హైదరాబాద్ నుంచి కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు జడ్చర్ల వయా భూ త్పూర్, కొత్తకోట, ఎర్రవల్లి, గద్వాల మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి రాయిచూర్ వెళ్లే వాహనాలను నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రం నుంచి అమరచింత, మస్తీపూర్ వయా జూరాల డ్యాం, గద్వాల నుంచి రాయిచూర్‌కు వెళ్లాల్సి వస్తోంది. మరో వైపు తెలంగాణ, క ర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రయాణికులు నదిపై రాకపోకలు సాగించేందుకు హిందూపూర్, కడేచూర్, సై దాపూర్, గుడూర్, గూగళ్, గబ్బూర్ మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు దూరభారంతో సతమతమవుతున్నారు. మరో పక్క హైదరాబాద్ నుంచి రాయిచూర్‌కు నడిచే ఆర్టీసీ బ స్సులను చివరి హాల్ట్ టైరోడ్డు వరకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి నది అంతర్భాగాన్ని దాటుకుంటూ ప్ర యాణికులు కాలినడకన దాదాపు 3 కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రం దేవసూగూర్కు చేరుకుంటున్నారు. ఇదే క్రమంలో కర్ణాటక నుంచి తెలంగాణలోకి వచ్చే ప్ర యాణికులు సైతం కాలినడకన టై రోడ్డుకు చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పాత బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అనుమతి లభిస్తే తప్పా ప్రయాణికుల కష్టాలు తీరవు.
కాలినడకన నది దాటుతున్నా..
కర్ణాటకలోని కడెచూర్ లో ఇంటర్ ఫస్టియర్ డి ప్లొమా కోర్సు చదువుతు న్నా. దేవసూగూర్ నుంచి ప్రతి రోజూ నదిలో నడుచుకుంటూ టై రోడ్డుకు చేరుకుంటున్నా. దీంతో సమయానికి కళాశాలకు చేరుకోలేకపోతున్నా. చదువుకు ఆ టంకం కలుగుతున్నది. చా లా దూరం నడవడంతో కాళ్లు నొప్పులవుతున్నాయి.
– బసవ ప్రభు, విద్యార్ధి, దేవసూగూర్
ఆయాసం వస్తోంది..
మాది కర్ణాటక రాష్ట్రం దేవసూగూర్ గ్రామం. సై దాపూర్లో మా కూతురు ఉంటుంది. రెండు రోజుల కిందట అక్కడికి నది దాటి నడుచుంటూ వెళ్లిన. ఈరో జు మళ్లీ మా ఊరు వెళ్లేందుకు టై రోడ్డు వద్ద బస్సు దిగి నడుచుకుంటూ దేవసూగూర్కు వెళ్తున్నా. బ్రిడ్జి ని ర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఏమో. ఇంత దూ రం నడిచి ఆయాసం వస్తుంది.
– భాగమ్మ, వృద్ధురాలు