ప్రతి ఎకరాకూ కృష్ణా జలాలు పారిస్తాం
పల్లె, పట్టణ ప్రగతితో మారుతున్న రూపురేఖలు
హరితహారంలో నాటిన మొక్కలను కాపాడాలి
గడప గడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు
అభివృద్ధి పనులకు అడ్డుపడితే కేసులు పెడుతాం
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి రూరల్, జూన్ 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రూపురేఖలు మారిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కిష్టగిరి గ్రామంలో మార్నింగ్ వాక్‌లో మంత్రి పాల్గొన్నారు. అధికారులతో కలిసి గ్రామంలోని సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలోని చెరువు, కుంటలను కృష్ణమ్మ నీటితో నింపుతామని పేర్కొన్నారు. కిష్టగిరి గ్రామ శివారులోని ఊర చెరువుకు కాల్వ ద్వారా నీటిని అందించేందుకు అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. ఇందుకోసం 1600 మీటర్ల పైపులైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
చెరువుకు సంబంధించిన తూము, అలుగు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని, ఎవరైనా ఆక్రమణ చేయడానికి గానీ, పనుల అడ్డగింతకు పాల్పడితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రగతి బాటలు పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. గడప గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బడిబాటలో భాగంగా పిల్లలను ప్రభుత్వ బడిలో చేరేలా కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ శిక్షణ కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాణిక్యం, సర్పంచ్ రవీందర్, మాజీ సర్పంచ్ పద్మావెంకటయ్య, ఎంపీటీసీ ధర్మానాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నరసింహ, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రావ్, మధుసూదన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, నారాయణానాయక్, కోళ్ల వెంకటేశ్, టీక్యా, కృష్ణానాయక్, శేఖర్, మణ్యం తిమ్మన్న, భగవంతు, వెంకటయ్యశెట్టి, రాము, గణేశ్, కురుమూర్తి, హలీం తదితరులు పాల్గొన్నారు.
కిష్టగిరి గ్రామ శివారులోని ఊర చెరువు తూమును పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి