కృష్ణ, మార్చి 27 : ప్రమాదవశాత్తు చిన్నారి గం జిలో పడి గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బొల్ల సుధాబాయి , నర్సిములు దంపతులు. అయితే సుధాబాయి అన్నం వండి తీసిన గంజి గిన్నెలో పెట్టింది.
ఈ క్రమంలో సుధాబాయి కూతురు నందిని (3) ఇంటి బయట ఆడుకుంటూ ఇంట్లోకి వచ్చి ప్రమాదవశాత్తు గంజి పెట్టిన గిన్నెలో పడడంతో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు గాయపడిన బాలికను వెంటనే రాయిచూరులోని పీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రాయిచూర్ రిమ్స్ దవాఖానకు తరలించారు. బాలిక చికిత్స పొందుతూ మృతి చెం దింది. పోలీసులు ఈ ఘటనపై
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.