కీరదోసకు భలే క్రేజ్
మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం కీరదోస. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి.
- మనిషిలో కొవ్వు తగ్గించే గుణం
- బీపీ అదుపునకు దివ్యఔషధం
- వేసవిలో చల్లదనంతో మేలు
- ఆరోగ్యానికి భరోసానిస్తున్న కాయలు
నెట్వర్క్ మహబూబ్నగర్, మే 14 : మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం కీరదోస. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. కీరదోస డీహైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం కూడా. చెమటతో కోల్పోయిన నీటిని లవణాలను శరీరానికి అందించడంలో చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే శరీరం నిగారింపు సంతరించుకుంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కాలం ఏదైన అదే క్రేజీ..
ఏ కాలంలో అయినా అతి తక్కువ ధరకు లభించే కాయల్లో కీరదోస ఒకటి. వేసవితాపం నుంచి మనిషికి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తోపుడు బండ్లపై వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కాయను కోసి కాస్త, ఉప్పు, కారం చల్లి తింటుంటే ఆ మజాయే వేరు. కిలోకు రూ.20 నుంచి రూ.30 మధ్య లభిస్తుంది. ఎక్కువగా శుభకార్యాలు, పెండ్లి సమయంలో కాస్త ధర ఎక్కువగా ఉంటుంది.
కీరదోసతో లాభాలు..
- కీరదోసలో 95శాతం నీరు ఉండడంతో డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తవు.
- మనిషి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.
- కీరదోస పొట్టులో విటమిన్ సీ ఉంటుంది.
- ఇందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు, తగ్గులకు సవరిస్తూ ఉంటుంది.
- వెంట్రుకల ఎదుగుదలకు కారణమైన సల్ఫర్, సిలికాన్ దోహదపడుతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
- కడుపులో మంట(ఎసిడిటీ)ని తగ్గిస్తుంది.
- జీర్ణక్రియను మెరుగుపరుచడంలో దిట్ట.
- కీరదోస తోక్కలోను విటమిన్ కె సమృద్ధిగా ఉండడంతో చర్మానికి మేలు చేకూరుస్తుంది.
- ఒక దోసకాయ ముక్కని 30సెకండ్లపాటు నాలుకతో నోటికి పట్టుకొని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బ్యాక్ట్టీరియాను చంపేగుణం ఉంటుంది.
- బరువు తగ్గాలనుకునే వారికి దీనిని మించిన ప్రత్యామ్నాయం మరొకటి ఉండదు. కీరదోస పీచు ఎక్కువగా ఉండడంతో మలబద్దకం సమస్య తీరుతుంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

