కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు.. 2,087 ఎకరాల్లో విస్తరించి దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. చుట్టూ ఎత్తయిన కొండలు.. పచ్చని చెట్ల మధ్య అడవి తల్లి ఒడిలో ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఇంతటి పేరున్న పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కంకణం కట్టుకున్నారు. దేశానికే ఐకాన్‌లా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో సందర్శకులకు మరింత ఆటవిడుపు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బర్డ్ ఎన్క్లోజర్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి అరుదైన 800 పక్షులను తీసుకురానుండగా.. పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. ఓ వైపు జలపాతం.. మరోవైపు పక్షులతో సెల్ఫీలు దిగేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : పక్షుల కిలకిలరావాలకు మహబూబ్‌నగర్‌లోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ వేదిక కానున్నది. 2,087 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్దదైన ఎకో అర్బన్ పార్కులో మ రో అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు. దేశ, విదేశాలు, వి విధ రాష్ర్టాల్లోని 800 రకాల అరుదైన పక్షులతో భారీ ఎన్‌క్లోజర్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో నే అతిపెద్ద బర్డ్ ఎన్క్లోజర్గా ఖ్యాతిగడించనున్నది. పక్షులకు కావాల్సిన క్లోజర్లు భారీ స్థాయిలో నిర్మించనున్నా రు. పర్యాటకులు పక్షులను దగ్గరగా వీక్షించేందుకు, ఏ రకమైన పక్షి అని తెలిసేలా నేమ్‌ప్లేట్ ఏర్పాటు చేయనున్నా రు. దగ్గర్లోనే జలపాతం, క్లోజర్లను కలిపి సెల్ఫీ తీసుకుని అనుభూతి పొందేలా రూపుదిద్దనున్నారు. రాష్ర్టానికే తలమానికంలా పార్కును తీర్చిదిద్దేలా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషి చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన పక్షుల ఎన్‌క్లోజర్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఇందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు.
ప్రతి దృశ్యం.. అద్భుతం..
జడ్చర్ల-మహబూబ్‌నగర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పర్వతశ్రేణిలో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. కొండవాలులు, లోయలు, మొక్కలతో కూడిన పచ్చని అటవీ ప్రాంతం చూపరులను కట్టిపడేస్తుం ది. ప్రవేశద్వారం ఆకట్టుకుంటున్నది. సీతాకోక చిలుక ఆ కారంలో ఏర్పాటు చేసిన ప్రదేశం వద్ద పిల్లలు, పెద్దలు సె ల్ఫీలు దిగుతున్నారు. బటర్‌ఫ్లై ఆకారంలో ఏర్పాటు చేసిన తోట చుట్టూ తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. 50 రకాల గులాబీ మొక్కలతో కూడిన ఉద్యానవనం ఆహ్లాదం గా ఉన్నది. మనిషి ఆకారంలో ఉండే హెర్బల్ గార్డెన్లో 49 రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. 1300 మీ టర్ల గ్రీన్‌కార్పెట్ గడ్డి అందమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా చేస్తున్నది.
ఉద్యానవనం వద్ద నీటి ఫౌంటేన్ ఏ ర్పాటు చేశారు. రావి, మర్రి, ఉసిరి, మారేడు వంటి జా తుల మొక్కలతో అస్ట్రో గార్డెన్ పార్క్ అభివృద్ధి చేశారు. 24 రాసులతో కూడిన రాశీవనం ఆకట్టుకుంటున్నది. నక్షత్రాల ఆకారంలో ఏర్పాటు చేసిన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిల్లలు ఆడుకునేందుకు అనేక ఆట వస్తువులు ఉన్నాయి. జిప్‌లైన్, జిప్సైకిల్, జోర్బింగ్బాల్ వంటి సాహస క్రీడలు కట్టిపడేస్తాయి. కొలనులో ఉన్న రెం డు అరుదైన హంసల స్వరాలు అద్భుతం. శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకుగానూ ఔట్‌డోర్ జిమ్ కూడా ఉన్నది. ఇక జిప్‌లైన్, జిప్సైకిల్, కమాండో టవర్, వాల్ైక్లెబింగ్, టైర్బ్రిడ్జి, వెదురు వంతెన యువతను ఆకట్టుకుంటున్నది.
పార్కులో 300 మీటర్ల ఎత్తున ఏడాదిపొడవునా జాతీయ జెండా రెపెరెపలాడుతుంటుంది. తెలంగాణలోనే ఎత్తైన రెండో ఫ్లాగ్జోన్గా గుర్తింపు పొందింది. సందర్శకుల కోసం వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. ఇ క్కడి నుంచి చూస్తే పార్కు మొత్తం కనిపిస్తుంది. కృత్రిమ వాటర్‌ఫాల్‌లో వర్షంలో తడుస్తున్న అనుభూతి వస్తుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీ, పందిరి చుట్టూ నడక ఏర్పాటు చేశారు. ఇలా పార్కులోని ప్రతి దృశ్యం అద్భుతమని చెప్పొచ్చు.