ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని బంగారు బాటలో పయనింపజేస్తూ..సబ్బండ వర్గాలు సంబురంగా జీవించేలా చేసిన కేసీఆర్ లాంటి నేత దేశానికి ఎంతో అవసరమని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దేశ్‌కీ నేతగా మారి.. జాతీయ పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా తెలంగాణ తరహాలో పాలన అందించాలని ఆకాంక్షిస్తున్నారు. 75 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం వెనుకబడిపోయిందని, ధరలు అదుపులో లేక సామాన్యుడు విలవిలలాడు తున్నాడని, దేశానికే అన్నం పెట్టే రైతన్నలు దీక్షలు, ధర్నాలు చేసే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌లాంటి నేత వల్లే మార్పు సాధ్యమని, దేశ రాజకీయాల్లోకి ఆయన రావాలని ఎంపీటీసీలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో మాకు గౌరవం ఇచ్చేలా చేసిన రాజనీతిజ్ఞుడని కొనియాడారు.
మహబూబ్‌నగర్, సె ప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నేతృత్వం లో అమలుచేస్తున్న పథకాలు పేదోళ్ల ఇండ్లల్లో కాంతులు నింపుతున్నా యి. గతంలో ఆడపిల్లల పెం డ్లిళ్లకు అప్పులు చేసేవా రు. బంగారం, ఇల్లు తాకట్టు పెట్టేవా రు. కానీ, తెలంగాణ వచ్చాక అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం వేలాది కుటుంబాలకు వరంలా మారింది. పేదల ఇం డ్లల్లో వైభోగాన్ని తెచ్చిపెడుతున్నది. ఆడపడుచులు కేసీఆర్‌ను పెద్దన్నలాగా దీవిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 12 వేల మందికి కల్యాణలక్ష్మి, రెండు వేల మందికి షాదీముబారక్ కింద రూ.1,00,116 చొప్పున సాయం అందించా రు. కొన్ని గ్రామాల్లో పెండ్లి కోసం వినియోగించే టెంట్‌హౌస్, భోజనాలకు అయ్యే ఖర్చులను కల్యాణలక్ష్మి చెక్ వచ్చిన తరువా అడుగుతున్నారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులకు ఈ పథకం వరంలా మారింది. దళారుల ప్రమేయం లేకుండా గ్రామ కార్యదర్శి నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు అన్ని పనులు ఉచితంగా కావడమే కా కుండా పెళ్లి అయిన నెల రోజులకే డబ్బులు నేరుగా అకౌంట్లలో జమ అవుతున్నాయి. అత్యంత పారదర్శకంగా చేపట్టిన ఈ పథకం చెక్కులను మం త్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలకు త గిన ప్రాధాన్యత లభిస్తున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇలాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు.
స్థానికంగా పెరిగిన గౌరవం..
ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులంటే లెక్కే ఉండేది కాదు. తెలంగాణ వచ్చాక పరిస్థితి మా రింది. మండల వ్యవస్థలో ఎంపీటీసీలకు గౌరవ వే తనం అందిస్తున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినా.. ప్రోటోకాల్ ప్రకారం వార్డు సభ్యు డు, సర్పంచ్, ఎంపీటీసీలకు తగిన గౌరవం లభిస్తున్న ది. ఇంతటి గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయా ల్లో వస్తే దేశవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం లభిస్తుందని అంటున్నారు. ఉమ్మడి జిల్లా ఎంపీటీసీలు ముక్తకంఠంతో కేసీఆర్ దేశ్‌కీ నేత అని నినదిస్తున్నారు. దేశరాజకీయాలను మలుపు తిప్పాలని కోరుతున్నారు.
చక్రం తిప్పడం ఖాయం..
స్వరాష్ట్రం సాధించిన స్ఫూర్తితో దేశంలోనూ కేసీఆర్ కొత్త ఒరవడి సృష్టిస్తారన్న నమ్మకం ఉ న్నది. కేంద్ర ప్రభుత్వ పాలనపై మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్‌లాగా దేశంలో ఎవరూ గొంతెత్తడం లేదు. ఈ క్రమంలో కేసీఆర్‌కు చాలా మద్దతు లభించే అవకాశం ఉన్నది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం.ఆయన నాయకత్వంలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. దేశంలోనే తెలంగాణ గడ్డకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ దేశం మొత్తం ప్రవేశపెడితే ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడి.. కేసీఆర్ పీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– కోట్ల బాలచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ, పెబ్బేరు
దేశంలో కీలకం కానున్నారు..
సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఎంతో అవసరం. రాష్ట్రంలోని పథకాలు దేశ వ్యా ప్తంగా అమలైతే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. జాతీయ పార్టీలో కేసీఆర్ కీలకంగా వ్యవహరించనున్నారు. నిరంతర ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు వంటి పథకాలు దేశ వ్యాప్తంగా అమలు జరగాలంటే కేసీఆర్ దేశ నాయకుడిగా ఉండాలి. కార్పొరేట్‌కు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ మెడలు వంచడానికి కేసీఆర్ తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు.
– శివలీల, వైస్‌ఎంపీపీ, అంతారం, తాడూరు
విప్లవాత్మక మార్పు రావాలి..
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ బడుగు, బలహీన వర్గాలకు చేసిందేమీ లేదు. రైతులకు న్యాయం జరగాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరిగినట్లు దేశంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరాలంటే కేసీఆర్ పీఎం కావాలి. రైతుబంధు, గిరిజన బంధు, దళితబంధు వంటి పథకాలు దేశ ప్రజలకు కూడా అందుతుంది. జాతీయ స్థాయిలో విప్లవాత్మాక మార్పు రావాలి. దేశంలోని నియంతృత్వ, దుర్మార్గ పాలన అంతం చేయాలంటే దేశ్ కీ నేత కేసీఆర్ జాతీ య రాజయాల్లోకి రావాలి. కేసీఆర్‌ను పీఎంగా చూడడం అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రజల చిరకాల కోరిక. దేశంలో కాంగ్రెస్‌కు చోటు లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే. రైతుల బాగుకోసం ఆలోచించి దే శంలో ఎక్కడా లేని విధంగా నిరంతర ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి సాయం, బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. రైతుల మేలు కోరే సీఎం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన లాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావాలి.
– శ్రీకళ, ఎంపీపీ, మరికల్
పట్టున్న నాయకుడు కేసీఆర్..
దేశ రాజకీయాల్లో పట్టున్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన పీఎం అయితే రాష్ట్రంలాగే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాలపై అవగాహన ఉన్న నేత. బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలు విసుగెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కేసీఆరే. ప్రజా సంక్షేమమే ధేయ్యంగా కేసీఆర్ సర్కార్ పనిచేస్తున్నది. బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నది. బీజేపీ సర్కార్‌కు పాతర వేసే రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్ పీఎం అయితే ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందనండలో ఎలాంటి సందేహం లేదు.
– అడ్డాకుల సంధ్య, ఎంపీపీ, గోపాల్పేట
దేశమంతా ఎదురుచూస్తున్నది..
తెలంగాణ ఇవ్వొద్దని ఆంధ్రోళ్లు ఎన్నో కుయుక్తులు పన్నారు. చావునోట్లోకి వెళ్లి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్‌ను ఆ భగవంతుడు ఎందుకు పుట్టించిండో ఇప్పుడు అర్థమవుతున్నది. రాష్ట్రంలోనే కాకుండా దేశం కోసం ఆయన పుట్టాడు. దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పారదర్శకంగా అమలు చేస్తున్నాడు. అందుకే ఆయన కోసం దేశమంతా ఎదురు చూస్తున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం మొత్తం బాగుపడుతుంది.
– బంగారు పెద్ద వెంకటయ్య, ఎంపీటీసీ, గాజులపేట
అన్ని వర్గాలకూ న్యాయం..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో అందరూ సంతోషంగా ఉన్నారు. మోదీ సర్కార్ ఎనిమిదేండ్ల పాలనలో లక్షల ఉద్యోగాలను తొలగించి కంపెనీలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టింది. దేశాన్ని దివాలా తీసేలా చేసింది. కానీ, రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశమంతా అమలైతే ప్రపంచంలోనే భారత దేశం నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తుంది. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. ఆయన నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం.
– ఎల్కోటి లక్ష్మి, ఎంపీపీ, ఊట్కూర్
సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం..
ప్రజల బాధలు తెలిసిన కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుంది. మోదీ పాలనతో నిత్యావసర సరుకులు, సిలిండర్, చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా, ప్రతి గుంటకూ సాగునీరు, పంట పెట్టుబడికి రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్, మండల కేంద్రాలకు డబుల్‌రోడ్డు వంటి ఎన్నో పథకాలు దేశమంతా అమలవ్వాలి. ఇదంతా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం. ఆయన పీఎం అయితే దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది.
– వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ, ఇటిక్యాల
బీజేపీ పీడ పోవాలి..
అనుకున్నది సాధించే పట్టుదల ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఒక్కడిగా వచ్చి.. లక్షలాది మందితో చేరి.. రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నేత. ఆయన దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా విజయం సాధిస్తాడన్న నమ్మకం ఉన్నది. దేశ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయి సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు. బీజేపీ పీడ పోవాలంటే కేసీఆర్ లాంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడే కరెక్ట్. సబ్బండ వర్గాల బాధలు తీరాలంటే కేసీఆర్ పాలన కావాల్సిందే.
– లత, ఎంపీటీసీ, వావిలాల, ఇటిక్యాల
కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి..
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తేనే భారతదేశం అభివృద్ధి జరుగుతుంది. వెనుకబడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ద్వారా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మహోన్నత వ్యక్తి. ఇదే స్ఫూర్తితో దేశ రాజకీయాల్లోనూ అడుగుపెట్టి విజయం సాధిస్తాడన్న ధీమా అందరిలోనే ఉ న్నది. దేశంలోని రైతులను కూడా కాపాడుకునే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. దేశాభివృద్ధి నాంది తెలంగాణే కానున్నది. కేసీఆర్ లాంటి గొప్ప నేత దేశానికి చాలా అవసరం.
– చీర్ణం బాలస్వామి, ఎంపీటీసీ, బిజినేపల్లి
నూతన నాయకత్వం అవసరం..
ప్రస్తుతం దేశంలో మతతత్వ పాలన కొనసాగుతున్నది. కుల, మత రాజకీయ పిచ్చి పోవాలంటే నూతన నాయకత్వం అవసరం. దేశ ప్రజలంతా కేసీఆర్ పాలన వైపు చూస్తున్నారు. విప్లవాత్మకమైన మార్పు కోసం కేసీఆర్ రావాలి. పారదర్శకమైన పాలన కోసం కేసీఆర్ పీ ఎం కావాలి. బీజేపీ ఎనిమిదేండ్ల పాలనలో చేసిందేమీ లేదు. కార్పొరేట్‌కు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సం స్థలన్నింటినీ కట్టబెట్టింది. ప్రపంచంలోనే అత్యంత కుబేరులను చేస్తున్నది. అలాంటి ప్రధాని మోదీ పాలన కు వీడ్కోలు పలకాలి. – రవికుమార్, వైస్ ఎంపీపీ, మరికల్
మోదీకి ప్రత్యామ్నాయం కేసీఆర్..
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సీఎం కేసీఆర్ రాజకీయ అనుభవం ఎంతో అవసరం. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనతో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేయడంతో నిర్వీర్యమయ్యాయి. దేశ పాలనలో మార్పు జరగాలి. రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌దే. ప్రజలకు మంచి పాలన అందించే నాయకులు దేశ రాజకీయాల్లో ఉండాలి. బీజేపీ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ పీఎం కావాలి. దేశ భవిష్యత్ మారాలి అని కోరుకుంటున్నా.
– క్యామ వాణి, ఎంపీటీసీ, ఖిల్లాఘణపురం
మార్గనిర్దేశం చేసే వ్యక్తి కేసీఆర్..
జాతీయ రాజకీయాలకు కేసీఆర్ ఆవశ్యకత ఎంతో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలాగా దేశం కూడా అభివృద్ధి చెందాలంటే సరైన మార్గ నిర్దేశం చేసే నాయకుడు కావాలి. అటువంటి లక్షణాలు కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇతర రాష్ర్టాల నాయకులను కూడగట్టి జాతీయ శక్తిగా మారే శక్తి, యుక్తి కేసీఆర్‌లో ఉన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి రాణించగలడు. దేశ రాజకీయాల్లో సత్తా చాటే బలం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. కేసీఆర్ పీఎం కావడం ఖాయం.
– కిల్లె మల్లయ్య, ఎంపీటీసీ, చేగుంట, తిమ్మాజిపేట