వనపర్తి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలో కాసం ఫ్యాషన్స్ 15వ షో రూంను సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా రంభించారు. ముందుగా అందాలతార అనసూయను చూసేందుకు అభిమానులు పరిసర ప్రాంతవాసులు, యువతీయువకులు బారులుదీరారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పుల్లూరు అరుణ్‌కుమార్, వరుణ్, మున్సిపల్ చైర్మన్ మహేశ్, వైస్‌చైర్మన్ కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్లు హాజరయ్యారు.
ఈ సం దర్భంగా అనసూయ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్స్‌తో నిత్యనూతన వె రైటీలతో కాసం ఫ్యాషన్స్ పేరుగాంచిందన్నారు. ఈ స్టోర్‌ను వనపర్తిలో తా ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాల్లోని లేడీస్, జెంట్స్, కిడ్స్‌వేర్‌ను కలియతిరిగి సందడి చేశారు. వనప ర్తి చుట్టుపక్కల వారంతా దుస్తులు కొనుగోలు చేయాలన్నారు. షా పింగ్మాల్ డైరెక్టర్లు కాసం నమశ్సివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రా ష్ర్టాల్లో 4 ఏండ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ వనపర్తిలో 15వ స్టోర్‌ను ప్రారంభించుకున్నామన్నారు. కార్యక్రమం లో కాసం ఫణీ, కాసం సాయికృష్ణ, కాసం ధీరజ్, డాక్టర్ కాసం ప్రీతం, యాంసాని ప్రవీణ్ పాల్గొన్నారు.