Maktal | మక్తల్, జూన్ 03 : నారాయణపేట జిల్లా కేంద్రంలో పాఠశాలల అభివృద్ధిలో వివిధ అభ్యసన పరిస్థితులపై నిర్వహించిన జిల్లా స్థాయి ప్రదర్శనలో ఉత్తమ ప్రతిపను సాధించి రాష్ట్రస్థాయి ప్రదర్శనకు మక్తల్ మండలం కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రూప ఎంపిక అవ్వడం జరిగిందని పాఠశాల జిహెచ్ఎం వెంకటయ్య గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెలలో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు నిర్వహించిన బెస్ట్ ప్రాక్టీస్ జిల్లా స్థాయి విద్య ప్రదర్శన కార్యక్రమంలో 53 మంది ఉపాధ్యాయులు పాల్గొని ప్రదర్శన నివ్వడం జరిగిందని తెలిపారు. ఇట్టి ప్రదర్శనలో కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి బీ రూప అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం వల్ల రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఉపాధ్యాయురాలు ఎంపిక కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే వ్యాయామ విద్య కో కరీక్యులర్ యాక్టివిటీస్పై రూప ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన వ్యాయామ ఉపాధ్యాయురాలు రూపను పాఠశాల అధ్యాపక బృందం, పలువురు విద్యావంతుడు అభినందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.