మాగనూరు, నవంబర్ 2 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో కర్ణాటక నుంచి అక్రమంగా ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నా రు. శనివారం కృష్ణ మండలం మారుతీనగర్ వద్ద కర్ణాటక బార్డర్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మారెట్ కమిటీ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద ధాన్యంతో వస్తున్న లారీని పోలీసులు అడ్డుకొని వివరాలు అడిగారు.
మక్తల్ మండలంలోని ఓ రైస్ మిల్ ద్వారా కర్ణాటకకు తరలించానని, అక్కడ వడ్లను తీసుకోకపోవడంతో తిరిగి తీసుకొనస్తున్నట్లు చెప్పాడు. కాగా, కర్ణాటకలో సరైన ధర లేకపోవడంతో తెలంగాణలో విక్రయించేందుకు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయశాఖ అధికారి సుదర్శన్గౌడ్ను వివరణ కోరగా, కర్ణాటక నుంచి తెలంగాణలోకి ధాన్యం రాగా, తిరిగి పంపించినట్లు తెలిపారు.