హస్తం పార్టీలో హైరానా మొదలైంది. కల్వకుర్తి నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలైన ప్పటి నుంచి ఏఐసీసీ కార్యక్రమాల్లో బీజీగా ఉంటూ ఢిల్లీకే పరిమితమయ్యారు. అప్పుడో.. ఇప్పుడో కల్వకుర్తికి వచ్చినా.. ఉనికిని చాటుకోవడానికే తప్పా మరెందుకు ఉపయోగపడలేదనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. దీంతో ‘చుక్కాని లేని నావ’ పరిస్థితిలా కల్వకుర్తి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి తయారైందని స్వయంగా ఆ పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు. ఈ తరుణంలో కొత్తగా పార్టీలో ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి చేరాడు. ఆయన చేరిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనికి తోడు సుంకిరెడ్డి రాకను జీర్ణించుకోలేని పాత నాయకులు ఆయనకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
– మహబూబ్ నగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బ్రహ్మ పదార్థాన్ని తలపిస్తున్నది. ఉందంటే ఉందని.. లేదంటే లేదనే స్థితిలోకి వచ్చింది. నియోజకవర్గంలో వంశీ పర్యటనలు లేకుండాపోయాయి. ఏఐసీసీ కార్యక్రమాల్లో భాగంగా దేశ రాజధానిలోనే ఉంటున్నాడు. దీంతో స్థానికంగా పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది.
కాంగ్రెస్‌లో చేరిన ఎన్ఆర్ఐ..
నాలుగు రోజుల ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జా తీయ అధ్యక్షుడి సమక్షంలో ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన కల్వకు ర్తి నియోజకవర్గంలో గత ఏడెనిమిది నెలల నుంచి ట్ర స్ట్ ఏర్పాటు చేసి తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ఆర్ఐ కావడం, ఆర్థిక బలం ఉండటం తో ట్రస్ట్ పేరిట హల్చల్ చేశాడు. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే గతంలో మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి వెనకాల ఉన్న కొందరు వ్యక్తులు వంశీతో వి భేదించి దూరమయ్యారు. వారు ప్రస్తుతం ఈ ఎన్ఆర్ఐ వెంట తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యం లో నాలుగు రోజుల కిందట ఎన్ఆర్ఐ సుంకిరెడ్డి ఏకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. కల్వకుర్తి కాంగ్రెస్‌లో అసలు ఏంజరుగుతుందనే అన్న అయోమయం లో ఉన్న కొద్దిపాటి క్యాడర్ పడిపోయింది.
ఆదిలోనే హంసపాదు..
కాంగ్రెస్‌పార్టీ తీర్థం పు చ్చుకున్న సుంకిరెడ్డికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కా ర్యక్రమాలకు పాల్పడ్డారని, ఎందుకు చర్యలు తీసుకోవద్దో జవాబు ఇవ్వాలంటూ.. కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి పేరిట సుంకిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం మరో చర్చకు దారితీసింది. 14 మార్చి 2022న కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న మీరు రాహుల్ జోడోయాత్ర, ప్రియాంకాగాంధీ యువ సంఘర్షణ యాత్రలో, కల్వకుర్తిలో పార్టీ చేపట్టిన ఇతర కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోవడంతోపాటు ఇతర పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరిపారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసి సోషల్ మీడియాల్లో వైరల్ చేశారు.
రెండు వర్గాలుగా..
అసలే ఉనికి కోల్పోయి చెట్టుకొకరు, గుట్టకొకరుగా మా రిన కల్వకుర్తి కాంగ్రెస్‌లో సుంకిరెడ్డి రాకతో రెండు వర్గాలయ్యాయి. ఇంతకు ముందే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సుంకిరెడ్డి ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ కండువా క ప్పుకోవడమేంటని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు మేం ఇక్కడ పడిగాపులు గా స్తుంటే.. రాత్రికి రాత్రే లీడరంటూ వస్తే మాకేం సంబంధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న వారికి అసలు కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి. ఇది ఇలా ఉంటే సుంకిరెడ్డి అనుచరుల వాదన మరో విధంగా ఉన్నది. ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ మాకే వస్తుందనే ధీమాగా ప్రచారానికి శ్రీకారం చుట్టగా.. వంశీ వర్గీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
సుంకిరెడ్డి ర్యాలీకి పార్టీ నేతలు దూరం
ఢిల్లీ నుంచి వచ్చిన సుంకిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఆయన అనుచరులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అర్థ బలం ఉండటంతో రోడ్లకు ఇరువైపులా కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకుల ఫొటోలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కడ్తాలలో ప్రారంభమైన ర్యాలీ కల్వకుర్తి వరకు నిర్వహించారు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ ర్యాలీలో పాల్గొనవద్దని వంశీచంద్‌రెడ్డి అనుచరు లు, ఆయా మండలాల కాంగ్రెస్ బాధ్యు లు, నాయకులు, కార్యకర్తలకు వి జ్ఞప్తి చేయగా.. ఆయన అనుచరవర్గ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనలేదు.
దేనికోసం ఆర్భాటం..
ఆర్థిక బలం ఉన్నంత మాత్రా నా ఆ ర్భాటాలు, ర్యాలీలు నిర్వహిస్తే జ నాదరణ కలుగుతుందా..? అన్న ప్రశ్న లు వినిపిస్తున్నాయి. సామాన్యుడి కష్టసుఖాల్లో పలుపంచుకుంటూ వారికి నిరంతరం అందుబాటు లో అంటే జనం గుర్తిస్తారని, అ లాంటిది హల్చల్ చేస్తే దేనికి ఉపయోగమని నియోజకవర్గ వాసులు పెదవి విరుస్తున్నా రు. ఏ పార్టీ నుంచి అయిన టిక్కెట్ వచ్చిందా..? లేదా ఏదైన ఘనత సాధించా డా..? ఎందుకంత పెద్ద ర్యాలీతో సంబురం ఎందుకుని నొసలు వి రుస్తున్నారు. ఇలాం టి హెలిక్యాప్టర్ లాం డింగ్ నేతల తో ఉపయోగం ఉండదని, ఇక్క డ కలిసిరాకపోతే తిరిగి వెళ్లిపోతారని సీ నియర్ కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.