గద్వాల/అయిజ, అక్టోబర్ 17 : ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో గురువారం జూరాల ప్రాజెక్టులకు 34,420 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 731, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 50 క్యూసెక్కులు వదిలారు.
38,408 క్యూసెక్కులను వినియోగిస్తూ ఐదు యూనిట్లలో విద్యుదుత్సత్తి చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 61,744 క్యూసెక్కుల అ వుట్ఫ్లో నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.316 టీఎంసీల నిల్వ ఉన్నది. కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 28,871, అవుట్‌ఫ్లో 28,607 క్యూసెక్కులుగా నమోదుకాగా.. ప్రస్తుతం 101.500 టీఎంసీల నిల్వ ఉ న్నది.
ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 36,443, అవుట్‌ఫ్లో 35, 800 క్యూసెక్కులు ఉండగా.. ఆయకట్టుకు 643 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.5 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 37, 936, అవుట్‌ఫ్లో 43,820 క్యూసెక్కులుగా నమోదుకాగా.. ప్రస్తుతం 127.83 టీఎంసీల నిల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 42,039, అవుట్‌ఫ్లో 39,733 క్యూసెక్కులుగా నమోదుకాగా.. ప్రస్తుతం 37.22 టీఎంసీల నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.