ధరూరు, జూన్ 5 : జూరాల ప్రాజెక్ట్‌కు బుధవా రం స్వల్పంగా వరద మొదలైంది. మూడు రోజులు గా కురుస్తున్న వర్షానికి 670 క్యూసెక్కుల వరద ప్రాజెక్ట్‌కు చేరినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 314.910 మీటర్ల నీటిమట్టం ఉన్నది. 149 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
అయిజ, జూన్ 5 : కర్ణాటకలోని ఆర్డీఎస్ (రాజోళి బండ డైవర్సన్ స్కీం) ఆనకట్టకు వరద మొదలైంది. ఎగువన కురిసిన వానలకు బుధవారం 7,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 7,952 క్యూ సెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ప్ర స్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.9 అడుగుల నీటిమ ట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ఆరంభం కావడంతో ఆర్డీఎస్ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో మొదలైంది. నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న వానలకు స్వల్పంగా వరద చేరుతున్నది. బుధవారం ఇన్‌ఫ్లో 430 క్యూసెక్కులుగా ఉండగా, అ వుట్ ఫ్లో 5 క్యూసెక్కులుగా నమోదైంది. టీబీ డ్యాం 100.855 గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 3.501 టీఎంసీల నిల్వ ఉన్నది. 1,633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గానూ ప్రస్తు తం 1,577.82 అడుగులకు చేరినట్లు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.