గద్వాల, సెప్టెంబర్ 30 : ఎగువన కురుస్త్తున్న వర్షాలతో సోమవారం జూరాల ప్రాజెక్టుకు 68,000 కూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు వద్ద 5గేట్లు ఎత్తి దిగువకు 75,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.430మీటర్లుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత 9.132 నీటి నిల్వగా ఉ న్నది.
జూరాల ఎడమ కాల్వకు 920, కుడికాల్వకు 720, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీ మా లిఫ్ట్-2కు 750 నీటిని విడుదల చేస్తున్నా రు. ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా 35,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాం 7గేట్లు ఎత్తి 32,100 నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు మొత్తం అవుట్‌ఫ్లో 75,200 క్యూసెక్కులు వరద దిగువకు విడుదల చేస్తున్నారు.
అయిజ, సెప్టెంబర్ 30 : కర్ణాటకలోని ఎ గువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఇన్‌ఫ్లో 10,665 క్యూసెక్కులు ఉండగా, అ వుట్ఫ్లో 10,153 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగి న టీబీ డ్యాంలో ప్రస్తుతం 101.773 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటిమట్టానికి గానూ 1632 అడుగులు ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 9,310, అవుట్ ఫ్లో 8,673 క్యూసెక్కులు ఉన్నది. ఆర్డీఎస్ ఆ యకట్టుకు 637క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 9 అడుగుల మేరకు నీటిమట్టం ఉన్నది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 26, 020 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 30 వేల క్యూసెక్కులు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టం 1705 అడుగులకు గానూ 1704.72 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి గరిష్ఠ నీటిమట్టం 129.72 టీఎంసీలకు గా నూ ప్రస్తుతం 128.19 టీఎంసీల నిల్వ ఉన్న ది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 36 వేలు, అవుట్ ఫ్లో 32,100 క్యూసెక్కులు ఉ న్నది. గరిష్ఠస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ 1614.86 అడుగులు ఉన్నది. గరిష్ఠ స్థాయి నీటి నిల్వ 37.40 టీఎంసీలకు గానూ 37.54 టీఎంసీలు ఉన్నది.