నాగర్‌కర్నూల్/అచ్చంపేట, ఫిబ్రవరి 23: శ్రీశైలం ఎడమగట్టు ఎస్ ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8మందిని బయటకు తీసుకురావడానికి రెండురోజులుగా సహాయక చర్యలు కొ నసాగుతున్నాయి. ఆర్మీ , సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృం దాలు ఆదివారం తెల్లవారుజాము వరకు దోమల పెంటకు చేరుకున్నాయి. శనివారం రాత్రి కొన్ని బృందాలు టన్నెల్లోకి ప్రవేశించి పరిస్థితిని అంచనా వేశారు. టన్నెల్లో మొత్తం బురద పేరుకుపోయి, కాంక్రీట్ పెలాలు, వాటర్‌తో ఇబ్బందికరంగా ఉందని తెలియజేశారు. ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఆర్మీ రెస్క్యూ టీం, సింగరేణి రిస్క్ టీంతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లే క్రమంలో వారు వెంబడి చేపల వేట కోసం ఉపయోగించే తెప్పలు, వెదురు తడకలు, ట్యూబ్‌లు, కర్రలు, తాళ్లను తీసుకెళ్లా రు.
రాత్రి 7గంటల సమయంలో వారు బయటికి వచ్చారు. అక్కడికి వెళ్లి వ చ్చిన రిస్క్ టీం తెలిపి న ప్రకారం 11కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో వెళ్లి అక్కడి నుంచి బురదలో కర్రలు, తడకలు, తెప్పలు సహాయంతో టీబీఎమ్ మిషన్ వరకు వెళ్లినట్లు తెలిపారు. లోపల మొత్తం మోకాళ్ల లోతు వరకు బురద, చీకటి, కాంక్రీట్ పెలాలు పెరిగిపడి నడవడానికి కూడా వీల్లేకుండా ఉందన్నారు. నీటి ఊట కొనసాగుతూ ఉండటంతో మొత్తం బురదమయంగా మారిందని రెస్క్యూ టీం అతి కష్టం మీ ద టీబీఎం మిషన్ వరకు వెళ్లినట్లు తెలిపారు. అయితే లోపల చి క్కుకుపోయిన 8మందికి సంబంధించి ఎలాంటి ఆచూకీ, ఆనవాళ్లు కనిపించలేదని పేర్కొన్నారు. టీబీఎం మిషన్‌కు ముందు భాగంలో 50మీటర్ల దూరం వరకు మొత్తం పైనుంచి కూలిపడిన మట్టి, కాం క్రీట్ పెలాలు పేరుకుపోయి మొత్తం బురదమయంగా భయంకరం గా మారిందన్నారు.
రెస్క్యూ టీంలు మరింత ముందుకు వెళ్లాలం టే పైనుంచి మరి ఏమైనా కూలిపడే ప్రమాదం ఉందని గ్రహించి అక్కడ నుంచి వెనుదిరిగినట్లు వివరించారు. లోపల చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు మిషన్ డ్రైవర్లు, నలుగురు కార్మికులు బ యటకు తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. లోపల చిక్కుకున్న 8మంది ఆచూకీ లభించకపోవడంతో వారి ఆరోగ్య పరిస్థితిపై పలువురు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. అయితే లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం ప్రభుత్వానికి, రెస్క్ బృందాలకు సవాల్‌గా మారింది.
ఎన్నిసార్లు లో పల వెళ్లి వచ్చినా పూర్తిస్థాయిలో పరిష్కారం కనుకొనలేక పోతున్నారు. మంత్రు లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ రెండో రోజూ దోమలపెంటకు చేరుకొని ఎప్పటికప్పుడు స హాయక చర్యలను ముమ్మరం చేశారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సా యంత్రం 5గంటల వరకు ఉండి తిరిగి హెలికాప్టర్లో వెళ్లిపోయారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాత్రి 9గంటలకు అధికారుల తో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను ముమ్మరం చేసేలా చర్చించారు. అయితే టన్నులకొద్ది బరువు ఉన్న టీపీఎం మిషన్‌కు సంబంధించి కొన్ని పరికరాలు విరిగిపడ్డాయని తెలిపా రు.
లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి అధికార యంత్రాంగం, రెస్క్యూ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలు పూర్తిస్థాయిలో సఫలం కావడం లేదు. అయితే అధికార యం త్రాంగం సమస్యకు పరిష్కారం కనుగొనే నిపుణుల సహాయం తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉండగా అలాంటి నిపుణులు అయితే కనిపించడం లేదు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావాలంటే కొన్ని రోజులు సహాయక చర్యలు కొనసాగించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే ట న్నెల్ మిషన్‌ను కట్ చేసి మిషన్ ముందు చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడమా? లేక ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషించడంపై చర్చిస్తున్నారు. మొత్తమ్మీద 8మందిని బయటకు తీయడం చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి నెలకొన్నది.