కొల్లాపూర్/కోడేరు, మార్చి 1: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నీడలు అలముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరుసగా ప్రతిపక్షాలపై దాడుల ప రంపర కొనసాగుతున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల మీటింగ్‌కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాడని.. ప్రభుత్వ పథకాలపై ప్రశ్నిస్తున్నాడని పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గు జ్జుల పరమేశ్‌పై గురువారం రాత్రి జరిగిన దాడి మరువక ముందే ఎ మ్మెల్సీ మీటింగ్‌కు హాజరైన కోడేరు మండలానికి చెందిన ఓ కుటుంబంపై కాంగ్రెస్ గూండాలు విచక్షణరహితంగా దాడులు చేశారు. అం తటితో అగకుండా పట్టపగలు కొల్లాపూర్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం వచ్చిన వారిని కాపుగాసి కా ర్లను అడ్డంపెట్టి సినీఫక్కీలో కత్తులు, గొడ్డలి, ఇనుప రాడ్లతో తెగబడిన ఘటన పట్టణవాసులు, దవాఖాన సిబ్బంది, రోగులను భయాభ్రంతులకు గురిచేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గ్రామంలో తమ కుటుంబంపై పార్టీ నాయకుడు పాండునాయక్ అతని అనుచరులు దాడుల కు తెగబడినట్లు బాధితులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ మా కు టుంబ సభ్యురాలిపై దాడి చేసి పుస్తెలతాడు లాక్కొని వెళ్లారని.. ఇదే విషయంపై కోడేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్సై బూతులు మాట్లాడి గెంటేశారని.. కనీసం పుస్తెలతాడు కూడా ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డాబా పెట్టుకొని బతుకుతున్న తమ జీవనోపాధిని దెబ్బతీసి రూ. 10లక్షలు నష్టం చేకూర్చారని వాపోయారు.
ప్రభుత్వం మారింది మాపైన ఉల్టా కేసులు అవుతాయని భ యంతో బతుకుతున్న తమపై రాజకీయంగా ఎదురు లేకుండా ఉం డాలని కాంగ్రెస్ నాయకులు వరుసదాడులు చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం మా అన్న రాజునాయక్ ఎమ్మెల్సీ కవిత మీటింగ్ వెళ్లి వచ్చాడని.. పగ పెంచుకొని అర్ధరాత్రి కరెంట్ తీసి ఇంటిపై దాడికి వచ్చారన్నారు. ప్రాణ భయంతో 100కి ఫోన్ చేయడంతోపాటు కోడేరు ఎస్సైకి ఫోన్ చేస్తే నీకు సినిమా చూపిస్తామని బెదరించాడని.. రాత్రంతా ఇంటినుంచి బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ గడిపినట్లు బాధితుడు రవినాయక్ వాపోయారు.
శనివార ఉదయం ఇంట్లో టిఫిన్ చేస్తుంటే అకస్మాత్తుగా కాంగ్రెస్ నాయకుడు పాండునాయక్ తన అనుచరులతో వచ్చి దాడి చేశారన్నారు. దాడిపై ఫిర్యా దు చేయడానికి వెళ్తే కోడేరు పోలీసులు పట్టించుకోలేదని కొ ల్లాపూర్ పోలీస్‌స్టేషన్ వస్తే లోపలికి రాకుండా గేట్లు వేశారని పేర్కొన్నాడు. దీంతో కొల్లాపూర్ దవాఖానకు చికిత్సకు వెళ్తే దాడి చేశారన్నారు. గ్రామంలో మా స్థలాన్ని ఆక్రమించుకొని మాపై దాడులకు పాల్పడుతున్నారని.. తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించారు. ప్రభుత్వ దవాఖానలో దాడి అనంతరం కూడా మారణాయుధాలను యథేచ్చగా అక్కడే పెట్టుకొని ఉన్నట్లు బాధితులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిపిన దాడిలో బీఆర్ఎస్ నాయకుడు రాజు నాయక్, అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. రాజు నాయక్ తలపై 18కుట్లు, రవినాయక్‌కు 4కుట్లు పడ్డాయి. శ్రీవిద్య చెయ్యి విరిగిపోయింది. బాలునాయక్ నడుంపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే లాలమ్మ, చిట్టెమ్మ, ఠాకూర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా దవాఖా న లేదా హైదరాబాద్‌కు రెఫర్ చేస్తామని డాక్టర్ తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నార్యానాయక్ తండాలో కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురై కొల్లాపూర్ దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు రాజునాయక్‌ను వారి కుటుంబ సభ్యులను శనివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బీఆర్ఎస్ నాయకుడు, కుటుంబ సభ్యులపై అత్యంత దారుణంగా విచక్షణారహితంగా దాడులు చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు భయపడొద్దని ధైర్యంగా ఉండాలని పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని మనోధైర్యం చెప్పా రు. కాంగ్రెస్ గూండాల చేతిలో ధ్వంసమైన కారును పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులైన మహిళలపై అర్థరాత్రి దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు.
గాయపడిన వారు చికిత్స నిమిత్తం కొల్లాపూర్‌కు వస్తే పట్టణ నడ్డిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కత్తులు, గొడ్డలి, ఇనుప రాడ్ల తో అత్యంత పాశవికంగా దాడిచేసి చంపేందుకు యత్నించారని.. దా డి వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. మీరు మా కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేస్తుంటే.. మేము రసగుల్లాలతో దాడి చేస్తామనుకోవద్దన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటికి తావులేదని.. సైలెంట్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజీలను ట్యాంపరింగ్ చేయకుండా బయటపెట్టాలని డిమాండ్ చేశా రు. శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగిన వెంటనే కోడేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల తర్వాత రాజు కుటుంబానికి ఆర్థికంగా నష్టం చేయడంతోపాటు మూడోసారి కాంగ్రెస్ నాయకులు దా డి చేశారన్నారు. మంత్రి జూపల్లి అండతోనే కొల్లాపూర్‌లో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కొల్లాపూర్‌లో అధికార పార్టీ అం డతో క్రైం రేట్ పెరిగిందన్నారు. హోంశాఖను చూసే సీఎం కొల్లాపూర్‌లో జరిగే ఆరాచకలపై క్రైంపై రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. 70ఏండ్ల మహిళలపై కూడా దాడులు చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
కాంగ్రెస్ నాయకులు చేసే తప్పుడు పనుల నుంచి కాపాడుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులను లేకుండా చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. కోడేరు పోలీస్‌స్టేషన్‌లో పట్టించుకోకుంటే కొల్లాపూర్ సీఐ కార్యాలయం వచ్చిన బాధితులను స్టేషన్లోకి రాకుండా గేట్లు వేసిన చరిత్ర కొల్లాపూర్‌లో మాత్రమే చూస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడిన వారిని వెం టనే అరెస్టు చేయాలని లేకపోతే పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామ ని హెచ్చరించారు. అంతకుముందు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూ రెడ్డి రఘువవర్ధన్రెడ్డి దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు రాజునాయక్, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీఆర్ఎస్ నాయకుడు రాజునాయక్, అతని కుటుంబ సభ్యులపై జరిగిన దాడి ఘటనలో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. శనివారం ఆ పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. దవాఖానలో దాడి చేయడం సరైనది కాదని.. దాడి చేసిన పాండునాయక్ పోలీస్ అదుపులో ఉన్నాడని ఈ విషయంపై రాజకీయం చేయొద్దని సూచించారు. అయితే కొల్లాపూర్ పట్టణంలో వందలాదిగా మంత్రి ఫొటోతోపాటు దాడికి పాల్పడిన పాండునాయక్ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను హుటాహుటిన తొలగించడం ప్రజలను విస్మయానికి గురి చేసింది.
బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిషన్‌నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు రవినాయక్ బాధితులతో కలసి వెళ్లి కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు ఉదయం ఫిర్యాదు చేసేందుకు వస్తే స్టేషన్లోకి రాకుండా గేట్లు ఎందుకు వేశారని పోలీసులను ప్రశ్నించారు.