నెట్వర్క్ మహబూబ్నగర్, జనవరి 13 : సంక్రా ంతి వచ్చింది.. సంబురాలు తెచ్చింది.. మంగళవా రం పండుగను జరుపుకొనేందుకు ఉమ్మడి పాలమూ రు జిల్లావాసులు సిద్ధమయ్యారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాల్లో ఈ పండుగకు విశిష్ట స్థానం ఉంది. కొత్త పంటలను ఇంటికి తీసుకొస్తూ కొంగొత్త ఆనందాలను ఇంటిల్లిపాదికి అందిస్తూ భోగభాగ్యాలు కల్పిస్తూ విరాజిల్లుతుంది. పిండి వంటలు పండుగకు ప్రత్యేక శోభ తీసుకొస్తాయి. పిల్లలు పతంగులు ఎగుర వేస్తూ కేరింతలు కొట్టిస్తుంది. భోగితో మొదలై కనుమతో పండుగ ముగుస్తుంది. కొత్త కోడళ్లతో, అల్లుళ్లు, ఆడపడుచులతో పల్లెలు సందడిగా మారాయి.
నక్షత్రాలన్నింటినీ కలిపి 108 పాదాలుగా.. 108 పాదాలను 12 రాశులుగా విభజించారు. ఈ నెలలో సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు.. అందుకే మకర సంక్రాంతి అంటారు. తెలంగాణ ప్రాంతంలో నువ్వులు, బెల్లం, కలిసి లడ్డులు, నువ్వుల రొట్టెలు, చెగోడిలు, చకినాలు వంటి వంటలు తయారు చేస్తారు. అలాగే కూరగాయాలన్నింటినీ వాయనంగా సమర్పించుకుంటారు. మకర సంక్రమణం రోజు నువ్వుల నూనెలో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. తలకు నూనెను రాసుకుని శనిగపిండితో స్నానం చేస్తే సకల భాగ్యాలు కలుగుతాయన్నది విశ్వాసం.
ఆవు పేడతో పిడికిలి పరిమాణంలో గోపురం ఆకారంలో చేసి వాటి మధ్యలో గరిక రెమ్మలు చెక్కి చుట్టూ పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. వాకిళ్లలోని ముగ్గుల మధ్యన గడప గడపకు రెండు వైపులా జతలు జతలుగా పెడుతారు. వాటి చుట్టూ చిక్కుడకాయలు రేగు పండ్లు, నవధ్యానాలు, బంతిపూలు పోశారు. రంగురంగుల ముగ్గులు సైతం అలరి ంచాయి. భోగి రోజు భోగి కుండలు, పాల కుండల ముగ్గులు వేశారు. సంక్రాంతి రోజు రథం ఇంటి లోపలికి ఇచ్చినట్లు వేసే ముగ్గులు, కనుమ రోజు రథం బయటికి వెళ్తుతున్నట్లు రంగవల్లులు వేస్తారు. చివరి రోజున రథం ముగ్గు వేస్తారు.
రావమ్మా మహాలక్ష్మీ.. రావ మ్మా.. అంటూ హరిదాసుల సంకీర్తనలు, పిల్లాపాపలు సల్లంగుండాలని డూడూ బసవన్నలు దీవించే దృశ్యా లు కనిపించనున్నాయి. బసవన్న అమ్మవారికి దండం పెట్టూ ఈ ఇంటికి మేలు జరుగుతుందని చెప్పు మంచి జరుగుతుందని చెప్పు అంటూ గంగిరెద్దుల తలలను ఊపిస్తూ గంగిరెద్దుల కులస్తులు కనింపించనున్నారు. సూర్యోదయం కంటే పండుగ రోజులు ముందే లేచి రకరకాల బట్టలతో గంగిరెద్దులను అలంకరించుకుని వాయిద్యాలతో ప్రదర్శనకు వస్తారు. సన్నాయి, బూర, డోలు, చేతిలో కంచుతో చేసిన చిన్న చేగంట, నెత్తిన రంగుల తలగుడ్డ, చెవికి కమ్మల జోడు, భుజాల మీద కండువాలు, గంగిరెద్దులకు ఇచ్చిన శిక్షణ వారి ఆటపాటల్లో స్పష్టంగా కనిపించనున్నది.
సంక్రాంతి పండుగ సమయంలో బియ్యం పిండితో అరిసెలు చేసుకోవడం ఆనవాయితి. మిగిలిన పిండితో చిన్నగా చిక్కుడు గింజల మాదిరిగా చేసి భోగి రోజున చిన్న పిల్లలకు దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు. ఉదయమే స్నానమాచరించి కొత్త బట్టలు ధరిస్తారు.
సంక్రాంతి మరుసటి రోజున.. బుధవారం నిర్వహించే పండుగను కనుమ. నోములు నోముకున్న వారు తమ చుట్టు ప క్కల ఉన్న ముత్తైదులను పిలిచి నో ము వస్తువులను వారికి వాయినం గా ఇస్తారు. పొలా లు దున్నే ఎద్దులకు కృతజ్ఞతలు తెలిపే విధంగా చేయడం ఆనవాయితీ.
సంక్రాంతికి ముందు రోజు భోగిని సోమవారం ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు సూర్యుడు ధనుష్ రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. స్వర్గలోకపు వాకిళ్లు తెరుస్తారని నమ్మకం ఉన్నది. తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. సజ్జ, నువ్వుల రొట్టెలు ప్రత్యేకం. తీపి వంటకాలతో పాటు ప్రత్యేకంగా వీటిని ఆరగించారు. చిక్కుడు కూరతో రొట్టెలను కలిపి తింటే ఆ రుచే వేరు.
సంక్రాంతితో పల్లెల్లో సందడి మొదలైంది. బతుకు దెరువు కోసం దూరప్రాంతాలకు వెళ్లిన కూలీలు సైతం సొంతూళ్లకు చేరుకున్నారు. బంధువుల, ఆత్మీయుల పలకరింపులతో ఇండ్లన్నీ కళకళలాడుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పండుగకు సర్వం సిద్ధం చేసుకున్నారు. నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. రంగు రంగుల ముగ్గులతో వాకిళ్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.