గద్వాల, ఫిబ్రవరి 13 : గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని భావించిన ఆ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓటర్లు చూపించారు. పూర్తి మెజార్టీ కాంగ్రె స్ పార్టీకి రాకున్న ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి మున్సిపాలిటీ లో పాగా వేయడానికి, ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి అధికార కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి దీటుగా అన్ని వార్డులో బీఆర్ఎస్ అ భ్యర్థులు బరిలో నిలిచి 11స్థానాలు కైవసం చేసుకున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఏడు స్థానాలతో సరి పెట్టుకోవాల్సిన పరిస్థి తి వచ్చింది. గద్వాల మున్సిపాలిటీలో హం గ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థుల ఇంటికి వెళ్లి కాళ్ల బేరం పెట్టారు. గద్వాల ఎమ్మెల్యే తన వార్డులో తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడు. ఆ వార్డుల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.
గద్వాలలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో రౌడీరాజకీయం మొదలైంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన అభ్యర్థి కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌం టింగ్ హాల్ దగ్గర వచ్చి తీసుకెళ్లడానికి ప్ర యత్నించారు. వీరికి పోలీసులు సహక రిం చడంతో పోలీస్ కాన్వాయ్‌తో 29వ వార్డు స్వతంత్ర అభ్యర్థి సత్యంను ఓ ప్రైవేట్ వాహనంలో పోలీస్ బందోబస్త్ మధ్య ఎమ్మెల్యే ఇంటికి పోలీసులు దగ్గరుండి తీసుక వెళ్లడానికి ప్రయత్నించారు. దీనిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయ త్నం చేసినప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థిని పోలీసులు ఎమ్మెల్యే ఇంటి దగ్గర దించి వెళ్లినట్లు సమాచారం. పోలీసులు, అధికార పార్టీ నాయకుల మొండి వైఖరిని నిరసిస్తూ శాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి హనుమంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.