హన్వాడ ఏప్రిల్ 17 : పీఎం జన్మన్ పథ కం కింద చెంచులకు ఇండ్లు మంజూరైనా నేటికి ఇండ్ల నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదని హౌసింగ్ అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ముందుగా రాంనాయక్ తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచుతో పాటు పలువురు సమస్యలను కమిషనర్ ద్పష్టికి తీసుకెళ్లారు. అలాగే గుడ్డిమల్కాపూరం గ్రామంలో చెంచుకాలనీకి వెళ్లి చెంచులు పడుతున్న ఇబ్బందులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సర్పంచ్ విమల 154 చెంచు కుటుంబాలు ఉండగా పీఎం జన్మన్ పథకం కింద 74 ఇండ్లు మం జూరై ఏడాది కావస్తున్నా నేటికి ఇండ్ల నిర్మా ణం ప్రారంభించలేరని, తాగునీటికి, సీసీరోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయని ఎ న్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని కమిషనర్‌కు వివరించారు. వెంటనే హౌసింగ్, రెవెన్యూ అధికారులతో కమిషనర్ సభ్యుడు మాట్లాడుతూ పీఎం జన్మన్ పథకం కింద చెంచులకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో వారికి మీరే వెంట ఉండి ఇండ్లు నిర్మించి వాటితో పాటు అన్ని సౌకర్యలు కల్పించాలి కానీ నేటి వరకు ఇండ్ల నిర్మాణం ఎందుకు ప్రారంభించలేరని అధికారులపై మండిపడ్డారు.
ఇక వారం రోజు లో 74ఇండ్లకు బెస్మెంట్ నిర్మించాలని నేను మళ్లీ వారంరోజులో ఇక్కడికి వస్తా లేకుంటే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. యారోనిపల్లిలో నిర్మించిన 12ఇండ్లను త్వర గా చెంచులకు అందేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు. రాంనాయక్ తండాలో ఆశవర్కర్, రేషన్ డీలర్‌ను నియమించాలన్నా రు. మైస మ్మ ఆలయం నుంచి రాంనాయక్‌తండా వరకు బీటీరోడ్డు పనులు ప్రారంభించేందేకు ఫారెస్టు అధికారులు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకసారి విద్యార్ధులకు ఉపన్యాసం, డ్యాన్స్ ప్రోగ్రాం లు ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజనులకు ఎలాంటి సమస్యలు ఉన్న తనకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవో యశోదమ్మ, తాసీల్దార్ కిష్టానాయక్, ఎంఈ వో గోపాల్‌నాయక్, ఈవోఆర్ జగదీశ్, మిషన్ భగీరథ ఏఈ యాదయ్య, ఏవో కిరణ్‌కూమార్ తదితరులు పాల్గొన్నారు.