వనపర్తి టౌన్, అక్టోబర్ 4 : జన హృదయ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మెట్టుపల్లి నుంచి భారీ కాన్వాయ్‌తో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోలాహలం మధ్య నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తల, అభిమానుల, శ్రేయోభిలాషులు అభినందలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలు కప్పి బర్తుడే విషెస్ తెలిపారు. దీంతో వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహం వద్ద సందడి నెలకొన్నది.
సింగిరెడ్డి అభిమాని మోహన్ ఎస్ఎన్ఆర్ పేరుతో ఏర్పాటు చేసిన యాపిల్ పండ్లను నిరంజన్‌రెడ్డి కట్ చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి మాజీ మంత్రిని ఆశీర్వదించారు. బీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. నిరంజన్‌రెడ్డి ప్రారంభించగా.. ఆయనపై ఉన్న అభిమానంతో 156 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. వీరికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు పంపిణీ చేశారు.
వనపర్తి జిల్లా దవాఖానలో రోగులకు గులాబీ పార్టీ శ్రేణులు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. పాన్గల్లో రామాంజనేయ ఆలయ నిర్మాణానికి నిరంజన్‌రెడ్డి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, రమేశ్‌గౌడ్, అశోక్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక కేక్‌లు కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
శుభాకాంక్షలు తెలిపిన ఆల..
కొత్తకోట, అక్టోబర్ 4 : వనపర్తి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కొత్తకోట మండలకేంద్రంలోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద శనివారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్, మాజీ సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవ రెడ్డి, ఆకుల శ్రీనివాసులు, గుంత మల్లేశ్, గాడిలా ప్రశాంత్, యుగేందర్ రెడ్డి, దేవరకద్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పసుపుల నెహ్రూ పాల్గొన్నారు.