మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, అక్టోబర్ 4: రామగుండం థర్మల్ ప్లాంట్‌ను టీజీ జెన్కో ద్వారానే నిర్మించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
జెన్కోకు చెందిన ఈ పవర్‌ప్లాంట్‌ను మూసివేసి, 580 ఎకరాల స్థలాన్ని సింగరేణికి అప్పగించి, ఆ సంస్థతో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని జేఏసీ నేతలు కోరారు. కొత్తగా నిర్మించే థర్మల్, జల, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను జెన్కో ద్వారానే నిర్మించాలన్నారు. కార్యక్రమంలో నవీన్, చంద్రశేఖర్, వెంకట్‌నారాయణ, సోమశేఖర్, స్వామి, బాబ్య, వెంకట్రాముడు, బల్‌రాంనాయక్, రామరాజు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.