వనపర్తి పట్టణంలో ప్రగతి పండుగకు వేళైంది. జిల్లా కేంద్రం గులాబీమయంగా మారింది. శుక్రవారం రూ.666.67 కోట్ల పనులకు ఐటీ, పు రపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్‌తో కలిసి పలు పనులకు అభివృద్ధి ప్రదాత శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే 1500 డబుల్బెడ్రూం ఇండ్లు సిద్ధం కాగా.. ఐటీ టవర్, ఆయిల్‌పాం కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు.
పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా వద్ద రూ.425 కోట్లతో నిర్మించిన ప్రత్యేక మిషన్ భగీరథ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 19 పనులతో షెడ్యూల్ బిజీగా ఉండనున్నది. మంత్రులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. గులాబీ జెండాలతో జంక్షన్లన్నీ నిండిపోయాయి. పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టగా.. జన సమీకరణకు పార్టీశ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
– మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐటీ ప రిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. కేటీఆర్‌తోపాటు మంత్రు లు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి ద యాకర్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తుండడంతో వనపర్తి పట్టణం గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా మంత్రులకు స్వాగతం పలుకుతూ భా రీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశా యి. కొత్తకోట నుంచి వనపర్తి వరకు గు లాబీ జెండాలతో అలంకరించారు.
సం కిరెడ్డిపల్లి గ్రామం వద్ద రూ.300కోట్ల వ్యయంతో చేపట్టే అయిల్‌పాం కంపెనీకి శంకుస్థాపన చేయనుండడంతో దే వరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి భారీఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. ఉదయం 10గంటలకు మం త్రులు హెలికాప్టర్ ద్వారా వనపర్తికి చేరుకుంటారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం సాయంత్రం కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొననున్నారు. సభకు భారీఎత్తున జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి నిరంజన్‌రెడ్డి మంత్రుల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను, ఉపాధి కోసం చేస్తున్న ప్రయత్నాలపై కొంతమంది అభివృద్ధి నిరోధకులు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. వీలైతే విపక్షాలకు వివరించే ప్రయత్నం చేయాలని మీడియాను కోరారు. ప్రజలు కేసీఅర్ చేపట్టిన అబివృద్ధిపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, కొంతమంది జీర్ణీంచుకోలేక అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పర్యటనలు విజయవంతం చేసేందుకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు..
వనపర్తిలో భారీ బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పా ట్లు చేశారు. సభకు భారీ ఎత్తున జ నాన్ని సమీకరిస్తున్నారు. మంత్రులకు స్వాగతం పలుకుతూ ముఖ్య కూడళ్లలో భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా గులాబీమయంగా మారింది. పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలను చేపట్టింది. గురువారం మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్టోబర్ 1వ తేదీన ప్రధాన మోదీ మహబూబ్‌నగర్ పర్యటన నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రధాన్యత సంతరించుకున్నది.
నియెజకవర్గంలో రూ.666. 67కోట్ల వ్య యంతో చేపట్టిన 19 పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేయనున్నారు. కొత్తకోట మం డలం సంకిరెడ్డిపల్లి గ్రామం వద్ద నిర్మించే అ యిల్పాం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. ప్రెన్యూక్యు కంపెనీ రూ.300కోట్లతో ఫ్యాక్టరీని దశలవారీగా విస్తరిస్తుందన్నారు. అయిల్‌పాం మార్కెటింగ్‌కు ఉద్దేశించి ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. బుగ్గపల్లితండా వద్ద రూ.425కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తారు.
వనపర్తి నియెజకవర్గం రాజాపేట వద్ద 96 డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి మంత్రి నిరంజన్‌రెడ్డి సుమారు 800 డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించారు. మొత్తం 1,500 డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించగా..రహదారి విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ఇవ్వగా మిగిలిన 700 ఇండ్లను నిరుపేదలకు కేటాయించారు. రాజాపేట, పీర్లగుట్ల వద్ద నిర్మించిన ఈ ఇండ్లను మంత్రులు ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులకు అందజేస్తారు. సురవరం కళాభవన్ పేరుతో నిర్మించిన భవనం జిల్లా కేంద్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సకల సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌ను కూడ ప్రారంభిస్తారు.
మంత్రి పర్యటన షెడ్యూల్..