మాగనూరు, ఏప్రిల్ 24 : మాగనూరు మండలంలో కాల్వల ద్వారా వృథాగా సా గునీరు పారుతోందని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. గత నెలకిందట మాగనూ రు, కృష్ణ మండలాలో పంటలు ఎండిపోతాయని సంగంబండ రిజర్వాయర్లో మోటర్లు పెట్టి, లెఫ్ట్ హై లెవెల్ కెనాల్, లెఫ్ట్ లో లెవెల్ కెనాల్, అలాగే రైట్ హై లెవెల్ కెనాల్, రైట్ లో లెవెల్ కెనాల్ కాల్వల ద్వారా సాగునీరు అందించాలని రైతులు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు.
కానీ ప్రస్తుతం పంట కోతలు అ యిపోయిన అనంతరం అధికారులు కాల్వల్లోకి వృథాగా నీటిని విడుదల చేస్తున్నారు. అసలే వేసవి కావడంతో ఆయా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడి, బోర్లలో నీరు ఇం కిపోయి నానా అవస్థలు పడుతుంటే సాగునీటి అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా పంటలు పూర్తయ్యాక సాగునీటి ని విడుదల చేయడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉన్న నీటినైనా కాపాడుకుంటే వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఉండవని, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.