మూసాపేట, మార్చి 8 : కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబుబ్‌నగర్ దశాబ్ద కాలంపాటు పచ్చని పంటలతో కళకళలాడింది. మార్పు కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రజలు ఊహించిన మార్పు కాకుండా మరో మార్పు మొదలైంది. రైతుల బతుకులు ఆగమవుతున్నాయి. నేటికీ ఇంకా రుణమాఫీ కాక, రైతుభరోసా లేక ఎంతో మంది అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే కన్నీరు పెడుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని చక్రాపూర్కు చెందిన రైతు ఉప్పరి వెంకటేశ్‌కు కనకాపూర్ శివారులో నాలుగు ఎకరాల భూమి ఉన్నది. అందులో మూడు వ్యవసాయ బోరుమోటర్లు ఉన్నాయి. అతడి పొలంతోపాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. ఇప్పటి వరకు పెట్టుబడి రూ.లక్ష వరకు వెచ్చించినట్లు తెలిపాడు. 15రోజుల నుంచి భూగర్భజలాలు అడుగంటిపోయి పంటకు నీళ్లు అందడం లేదు. దీంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని మరో బోరును వేయించారు. 450 ఫీట్ల లోతువరకు బోరు వేయించినా చుక్క నీరు రాకపోవడంతో రైతుకు మరింత నష్టం వచ్చింది.
చక్రాపూర్కు చెందిన రైతు ఉప్పరి మల్లేశ్‌కు సొంతంగా రెండెకరాలు ఉండగా వరి పంట సాగు చేశాడు. బోరుమోటరు నుంచి నీళ్లు రాకపోవడంతో పంట ఎండిపోతుంది. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని బోరును తవ్వించాడు. ఏకంగా 700మీటర్ల వరకు వ్యవసాయ బోరును తవ్వించినా చుక్క నీరు రాకపోవడంతో రైతు దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు.
మహబుబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని చక్రాపూర్కు చెందిన రైతులు సాయిలు కనకాపూర్ శివారులో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. కానీ 30ఏండ్లు ఎండిపోని బోరుమోటరు ఎండిపోయింది. దీంతో వేసిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే బరువెక్కిన హృదయంతో రైతు ఆవేదన చెందుతున్నాడు.
మూసాపేటకు ఎందిన రైతు గోవిందుగారి సాగర్‌కు కన కాపూర్ శివారులో రెండెక రాల వ్యవసాయ భూమి ఉన్నది. వరి సాగుచేశాడు. బోరుమోటరులో నీళ్లు రాక పంటఎండిపోతున్నది. చేసేది లేక గొర్రెలను మేపేందుకు వ ది లేశాడు. వేలకు వేలు పె ట్టుబడి పెట్టి తీవ్రంగా న ష్టపోయానని అవేదన చెందుతున్నాడు.