గద్వాల, మార్చి 8 : జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి, గట్టు మండలంలోని రైతుల చివరి ఆయకట్టుకు నీరు రాక అనేక అవస్థలు పడుతున్నారు. ఇ టు అధికారులు, అటు నాయ కులకు తమ గోడు వెళ్ల బోసు కున్నా ఎవరూ పట్టించుకో కపోవడంతో దిగాలు చెం దుతున్నారు. తమ కు కాం గ్రెస్ సర్కారు కష్టా లను తె చ్చిపెట్టిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. కోటి ఆ శల తో అప్పులు చేసి సాగు చేసిన పంటల కు నీరు అందక కండ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాత ల గుండెలు బరువెక్కుతున్నాయి. బీఆర్ ఎస్ పాలనలో రైతులకు ఎ టువంటి నీటి, విద్యుత్ కష్టా లు లేకపోవడంతోపాటు సీజన్ ప్రారంభం కాగానే రైతుల ఖా తాల్లో రైతుబంధు జమచేయడంతో పదేండ్ల పాటు సాగు సంబురంగా సాగింది.
రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను గాలికొదిలేసింది. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో రైతులకు ఎ టువంటి చేయూత లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కరువు ఛాయలు అలుముకు న్నాయి. కేటీదొడ్డి మండలంలోని కొండాపురం, ఈర్లబండ, గం గన్పల్లి, వెంకటాపురం, గువ్వలదిన్నె, ఇర్కిచేడ్, గట్టు మండ లంలోని పెంచికలపాడ్, గట్టు గ్రామాల్లో రైతులు సాగు చేసిన వ రి పంటకు పూర్తిస్థాయిలో నీరందక పోవడంతో ప్రస్తుతం పొట్ట మీద ఉన్న పైరు ఎండిపోతుండడంతో రైతులు ఏం చేయాలో పాలుపోక దిగాలు చెందుతున్నారు. కేటీదొడ్డి, గట్టు మండలంలో సుమారు 8,500 ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేశారు.
ఈ పంటలకు 104 ప్యాకేజీ ద్వారా ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచి సాగునీరు అందించాల్సి ఉన్నది. అయితే 4టీఎంసీల నీరు నిల్వ ఉండాల్సిన రిజర్వాయర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం నాసిరకం పనులు చేయడంతో రిజర్వాయర్ నుంచి నీరు లీకేజీల ద్వారా బయటకు వస్తుండడంతో ప్రస్తుతం 1.5టీఎంసీ నీరు కూడా నిల్వ లేని పరిస్థితి నెలకొన్నది. ఈ రిజర్వాయర్ కింద కే టీదొడ్డి మండలంతోపాటు గట్టు మండలంలో కొంత భాగం, మ ల్దకల్ మండలంలో పొలాలకు నీరు పారు తున్నది.
గట్టు, కే టీ దొడ్డి శివారులో సుమారు 500 ఎకరాలకు పైగానే చివరి ఆ య కట్టుకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. చివరి ఆ యకట్టు వరకు నీరు ఇచ్చి తమ పంట పొలాలను కాపాడాలని రైతులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసినా ఇప్పటి వరకు సా గునీటిపై అధికారులు గానీ, సర్కారు గానీ ఎటువంటి హామీ ఇ వ్వలేదు. మంత్రితోపాటు ఎమ్మెల్యే కర్ణాటక నుంచి 4టీఎంసీల నీరు విడుదల చేస్తారని చెప్పి రైతులను మోసం చేశారు. ఇప్పటి వరకు కేవలం 0.45 టీఎంసీల నీటిని మాత్రమే కర్ణాటక వి డుదల చేసింది. మిగతా నీరు విడుదల చేస్తే తప్పా గద్వాల ని యోజకవర్గంలో పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. కేటీదొడ్డి మం డలంలో ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాల్యంపాడ్ రిజ ర్వాయర్ ద్వారా తమ పంటలకు నీరు వస్తుందనే ఆశతో రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో నీరు రావడం లేదు. మాపై పొలాల రైతులు మోటర్లు పెట్టుకోవడంతో చివరి ఆయకట్టు వరకు నీరు రావడం లేదు. బోరు ద్వారా ఎకరానికి నీరు పారుతున్నది. ఎకరంన్నర పంట ఎండిపోయే దశకు చేరుకున్నది. ఇప్పటి వరకు ఎకరాపై సుమారు రూ.25వేలకు పైగానే ఖర్చు చేశా. నీళ్లు రాకపోతే మాకు కన్నీళ్లే.
– రంగస్వామి,గంగన్పల్లి
నేను 8ఎకరాలు వరి పంట సాగు చేశా. అందులో ప్రస్తుతం మూడెకరాలు పూర్తిగా ఎండిపోయే దశకు చేరుకున్నది. ఇప్పటికే రూ.80వేల వరకు ఖర్చయ్యింది. వారబంధి ద్వారా యాసంగి పంటలకు నీళ్లు వదులుతున్నారు. వారంలో నాలుగు రోజులు నీళ్లు వదిలితే మా పొలాలపై రైతులు మోటర్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. దీంతో కిందున్న పంటలకు నీళ్లు రావడం లేదు. రెండు రోజులు పైన ఉన్న రైతులకు, రెండు రోజులు కింద సాగు చేసుకున్న రైతుల పొలాలకు నీళ్లు ఇస్తే కొంత పండుతయి. కలెక్టర్, విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
– అశోక్, కొండాపురం
మూడెకరాల్లో వరి సాగు చేశా. చివరి ఆయకట్టుకు నీళ్లు అందకపోవడంతో రెండు ఎకరాలు ఎండిపోయే దశకు చేరుకున్నది. ఎకరా పంటను బోరు ద్వారా కాపాడు కుంటున్నా. వారబంధి కాకుండా నెల రోజులు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తే రైతులు గట్టెక్కే అవకాశం ఉన్నది. ఆ దిశగా అధికారులు, ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరమున్నది.
– తిమ్మారెడ్డి, కొండాపురం