మహబూబ్‌నగర్, అక్టోబర్ 13 : నాన్న నేను ఇక్కడ చదవలేను.. నేను మన ఊరికి వచ్చి చదువుకుంటా.. అని చెప్పి లేఖ రా సుకొని గురుకులంలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని హాస్టల్లోని బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ సమీపంలో రాంరెడ్డి గూడం వద్దనున్న గురుకులంలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రానికి చెందిన నాగేశ్, పద్మమ్మకు 5 మంది ఆడపిల్లలు ఉన్నారు.
తల్లి,తండ్రి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మూడో కూతురు ప్రియాంక (16) పదో తరగతి పాసైన తర్వాత అదే మండలంలో గురుకులంలో ఇంటర్లో సీటు వచ్చింది. అయితే అక్కడ అధిక మొత్తంలో విద్యార్థులు ఉన్నారని మహబూబ్‌నగర్ మండలంలోని రాంరెడ్డిగూడెంలో ఇంటర్ ఎం పీసీ సీటు కోసం ఇక్కడకు బదిలీ చేశా రు. అయితే కొద్ది రోజులుగా ప్రియాంక ఇక్కడ బాగాలేదు.. నేను ఇక్కడ ఉండను మన ఊరి దగ్గరే ఉండి చదువుకుంటా అని తండ్రికి ఫోన్ చేసినట్లు తండ్రి చెప్పాడు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కాని సోమవారం రాంరెడ్డిగూడెంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోని బాత్రూంలో డోర్ పెట్టుకొని చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అయితే బాత్రూం ఎంతకూ తెరవకపోవడంతో గమనించిన విద్యార్థినులు వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి డోరు కొట్టినా తెరవకపోవడంతో డోర్‌ను పగులగొట్టి తెరవగా అప్పటికే ఉరేసుకొని ఉండడంతో వెంటనే ప్రియాంకను మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుడు అప్పటికే ప్రియాంక మృతి చెందినట్లు నిర్దారించారు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం హాస్టల్‌కు చేరుకున్నారు.
కలెక్టర్ విజయేందిరబోయి సైతం వెంటనే దవాఖానకు వచ్చి విద్యార్థి ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రితో మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మృ తదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయి తే మృతురాలి తల్లి పద్మమ్మ తమ గ్రామానికి చెందిన ఖాదర్ అనే వ్యక్తి మా అమ్మాయిని వేధిస్తున్నాడని, ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ వెల్లడించారు.