మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 2 : మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు రాష్ట్ర అధికారు ల ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఈ నెల 22 వ తేదీ వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఆ దేశించడంతోపాటు ఇంటర్‌బోర్డు అధికారులు అం దుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘానీడలో ప రీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నా ప్రై వేటు కళాశాలల యాజమాన్యం వ్యతిరేకిస్తున్నాయి.
మొదటి దశ ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, రెండో దశ ఈ నెల 8నుంచి 12వ తేదీ వర కు, మూడో దశ ఈ నెల 13నుంచి 17వ తేదీ వరకు, నాలుగో దశ పరీక్షలను ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించనున్నారు. హాల్ టికెట్లు ముద్రించిన తేదీలు, సమయాన్ని బట్టి విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుం ది. జిల్లా ఇంటర్ అధికారులు, జిల్లా పరీక్షల కమిటీ ని, ప్రత్యేకంగా ప్లయింగ్స్కాడ్లను ఏర్పాటు చేశారు.
ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల నిఘానీడలో నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయంపై సందిగ్దత కొనసాగుతున్నది. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల పరీక్షా కేంద్రాల్లో అధికారులే ప్రయోగశాలలు, ఆవరణల్లో సీసీ కెమెరాలను రెండు రోజులుగా అమర్చేపనిలో నిమగ్నమయ్యారు. ప్రైవేట్ పరీక్షా కేంద్రా ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చే యడం పై ఆయా కళాశాలల యా జమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి.
ప్రైవేటులో జనరల్ 13, ఒకేషనల్ 3 కేంద్రాలు ఏర్పాటు చేసినా.. వా టిలో ప్రభుత్వం నిర్ధేశించిన తరహాలో వీడియో, ఆడియో రికార్డిం గ్ ఎంత వరకు పనిచేస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో తాము సహకరించబోమని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు రాష్ట్ర, జిల్లా స్థా యిలో అధికారులకు వినతులు స మర్పించాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉం ది. జిల్లావ్యాప్తంగా మొత్తం 12,109 మంది విద్యార్థులు జనరల్, ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు రాయనున్నారు. ఇందుకు 42పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్ ప్రయోగ పరీక్షలు 8,392 మంది విద్యార్థులు, ఒకేషనల్ విద్యార్థులు 3,717 మంది పరీక్షలు రాయనున్నారు.