నారాయణపేట, జనవరి 12 : పట్టణంలో ఈనెల చివరి వారంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రారంభోత్సవ పనులను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్‌తో కలిసి పరిశీలించారు. ముందుగా కొండారెడ్డిపల్లి చెరువు వద్ద చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ అ భివృద్ధి పనులను పరిశీలించి ఇంజినీర్లకు సూచనలు చేశా రు. అక్కడి నుంచి ఎర్రగుట్ట వద్ద నిర్మించిన సఖి సెంటర్ భవనాన్ని పరిశీలించారు. సఖి సెంటర్ నిర్మాణ పనుల్లో నా ణ్యత లేకపోవడంపై అసంతృప్తి వ్య క్తం చేశారు. అనంతరం కొత్త బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈనెల 22 వరకు పూర్తి స్థాయిలో పనులు చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. సింగారం వద్ద ని ర్మించిన పార్టీ కార్యాలయ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధు లు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాలను పూర్తి పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని, అందులో ఎలాంటి అవకతవకలకు తావుండదని, అందుకు నిదర్శనమే ఎనిమిది ఏండ్లుగా రా ష్ట్రంలో చేపడుతున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియగా చెప్పవచ్చని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణ, మండలా ల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు జరిపిన పరీక్షల్లో ఎంపికైన టీచర్లు, ఆయాలకు గురువారం క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వ చ్చిందని, అలాంటి వారు ఉంటే తమకు తెలిపాలని ఎమ్మె ల్యే అన్నారు.
ఆధ్యాత్మిక విలువలు చాటి చెప్పిన మహనీయుడు స్వా మి వివేకానందుడని, ఆయన ప్రసంగాలు యువతలో చైత న్యం నింపేలా ఉండేవని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. స్వామి వివేకానందుడి జ యంతి సందర్భంగా గురువారం పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్ఐ కృష్ణయ్య, డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, జనవరి 12 : పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఎల్లప్పు డూ ఉంటాయని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండ లంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన శివరామకృష్ణ కు మారుడు బీఆర్ఎస్ కార్యకర్త నర్సింహ (గణేశ్) కొన్ని నెల ల కిందట హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తు మరణించాడు. పార్టీ నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎక్లాస్పూర్ గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు గురు వారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి కుటుంబానికి పెద్ద అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. అలాగే పేట క్యాంప్ కార్యాలయంలో శేర్నపల్లి గ్రామానికి చెందిన శివకుమార్‌కు మంజూరైన రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జమునాబాయి, ఎంపీటీసీ రాంరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, ము న్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, బీఆర్ఎస్ మం డల అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రవీందర్‌గౌడ్, ప్రచా ర కార్యదర్శి రాజు, యూత్ మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.