బిజినపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ( Indiramma Houses ) నిర్మించి ఇవ్వాలని సీపీఐ (CPI ) జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ అన్నారు. ఆదివారం బిజినాపల్లి మండలం వెలుగొండ గ్రామంలో దాసరి నాగభూషణం కమిటీ హాల్లో సీపీఐ గ్రామ శాఖ మహాసభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శాఖ మహాసభలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో అరుణ పతాకాలు ఎగురవేయాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు పూర్తిగా ఇవ్వాలని, రైతుబంధును అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యానికి నష్టపరిహారం కట్టించి ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, మండల కార్యదర్శి కృష్ణాజి, భూపేష్, కృష్ణారెడ్డి, గంగాధర్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.