అయిజ, జూలై 30 : కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలారు. శనివారం డ్యాంలో 44,483 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 30,671 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 102.737 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అ ధికారులు తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు 74,470 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 74 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ఆయకట్టుకు 470 క్యూసెక్కులు వదిలారు.
సుంకేసులలో..
రాజోళి, జూలై 30 : సుంకేసుల జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. జలాశయానికి 72,046 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 18 గేట్లు ఎత్తి 70,506 క్యూసెక్కులను శ్రీశైలానికి వదిలారు. అలాగే 1,540 క్యూసెక్కులను కేసీ కెనాల్‌కు విడుదల చేశారు.
జూరాలలో..
అమరచింత, జూలై 30 : జూరాల రిజర్వాయర్‌లో శనివారం సాయంత్రం 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. విద్యుదుతృత్తి కోసం 22,086 క్యూసెక్కులు వదులుతున్నారు. అలాగే భీమా లిఫ్ట్-1కు 650, భీమా లిఫ్ట్-2కు 750, కుడి కాల్వకు 437, ఎడుమ కాల్వకు 920 క్యూసెక్కులు వదిలారు. దీంతో ప్రాజెక్టు నుంచి 26,532 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
శ్రీశైలానికి నిలకడగా..
శ్రీశైలం, జూలై 30 : శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా వస్తున్నది. శ్రీశైలం జలాశయానికి 87,852 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. శ్రీశైలం ఏపీ పవర్‌హౌస్‌లో 9,574, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూసెక్కులు విద్యుదుత్పత్తి కోసం వదిలారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 185.56 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సంగంబండ ఆరు గేట్లు ఎత్తివేత
మక్తల్ రూరల్, జూలై 30 : మండలంలోని సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వరద భారీగా వస్తున్నది. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కర్ణాటకలోని ఇడ్లూర్ వా గు నుంచి వరద వస్తున్నది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త గా రిజర్వాయర్ లో ఆరు గేట్లు ఎ త్తి నీటిని జూరాల ప్రాజెక్టులోని వదిలారు. రిజర్వాయ ర్ పూర్తి స్థాయి నీ టి నిల్వ 3.313 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.6 టీ ఎంసీలు ఉన్నది.