హన్వాడ : హన్వాడ నుంచి దొరితండ వెళ్లే రోడ్డు (BT Road Works) మధ్యలో నిలిచిపోవడంతో వాటిని పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు (BRS Leader) డిమాండ్ చేశారు. శనివారం రోడ్డు పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్ణాకర్ గౌడ్ మాట్లాడుతూ దొరితండా నుంచి హన్వాడ వరకు రోడ్డు ఆపకుండా పూర్తి చేయాలన్నారు. సగం వరకు వేసి మిగతా రోడ్డు నిలిపివేయడంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.
హన్వాడ నుంచి దాదాపుగా 600 మీటర్ల వరకు రోడ్డు ఆగిపోయిందని వివరించారు. ఎమ్మెల్యే స్పందించి నిధులు మంజూరు చేసి పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. వర్షాలు పడుతుండడం వల్ల రోడ్డుపై నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలరాజ్. మాజీ జడ్పీటీసీ నరేందర్, మాజీ వైస్ ఎంపీపీ కొండ లక్ష్మయ్య, నాయకులు జంబులయ్య, శ్రీనివాసులు, హరిచందర్, యాదయ్య, మాధవ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.