మహబూబ్‌నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో పాలమూరు నుంచి పట్నానికి ఇరుకైన, గతుకుల రహదారిపై ప్రయాణానికి ప్రజలు ఆ పసోపాలు పడేవారు. మహబూబ్‌నగర్ నుంచి జ డ్చర్లకు 13కి.మీ.ల ప్రయాణానికే అరగంట పట్టేది.. ఇక హైదరాబాద్‌కు వెళ్లాలంటే మూడుగంటలు పట్టేది. జిల్లాకేంద్రం నుంచి మండలాలకు వెళ్లే రో డ్లన్నీ గోతులుగా ఉండి ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. తెలంగాణ సిద్ధించాక రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన రహదారులు, జిల్లాకేంద్రాలు, మండలకేంద్రాలను అనుసంధానిస్తూ వేసిన డబుల్ రోడ్లు ప్రయాణ సమాయాన్ని సగానికి తగ్గించాయి.
రహదారులపై వాహనాలు రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం కనిష్ఠ వేగం గంటకు 80 కి. మీ. కాగా గరిష్టం 100కు చేరింది. రహదారులన్నీ బీటీలుగా మారడంతో ఆర్టీసీ ప్రయాణ సమయం సగానికి తగ్గిందని డ్రైవర్లు అంటున్నారు. ప్రధాన రహదారులపై ఆర్వోబీలు, హైలెవల్ వంతెనలు పూ ర్తి కావడంతో గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడిజిల్లాలో హైదరాబాద్-బెంగళూరు, కోదాడ-రాయిచూర్ 167వ రహదారి, హై దరాబాద్-శ్రీశైలం, తాండూరు వయా మహబూబ్‌నగర్-శ్రీశైలం, హైదరాబాద్-సోమశిల, మహబూబ్‌నగర్-యాద్గీర్, వనపర్తి-కొల్లాపూర్, అచ్చంపేట మీదుగా కోదాడ రహదారులన్నీ పూర్తవడంతో రవాణ వేగం పుంజుకున్నది.
పాలమూరులో రూ.100కోట్లతో బైపాస్, రూ.732కోట్లతో మహబూబ్‌నగర్-చించోలి రహదారి, నాగర్‌కర్నూల్ జిల్లాలో రూ.629 కోట్లతో క ల్వకుర్తి-ఏపీలోని ఆత్మకూర్ వరకు, గట్టు మండలం నుంచి నాగులదిన్నె, రాజోళి వరకు రహదారి పను లు నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, దేవరకద్ర, గద్వాలలో పెండింగ్‌లో ఉన్న ఆర్ఓబీలను నిర్మించడంతో ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. దేవరకద్ర, ధన్వాడ, నారాయణపేట, కురుమూర్తి, ఊకచెట్టువాగు, తుంగభద్ర నదిపై అలంపూర్, నాగులదిన్నె వద్ద బ్రిడ్జీలు, హైలెవల్ వంతెనలు నిర్మించడంతో వరదలొచ్చినా ప్రయాణం సాఫీగా సాగించవచ్చు.
రింగ్‌రోడ్డుకు ప్రతిపాదనలు..
మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండంతోపాటు భారీ వాహనాలను దారి మళ్లించేందు కు బైపాస్ ఏర్పాటు చేయడంతో ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. గతంలో ప్రతిపాదనలకే పరిమితమై.. నిధుల మంజూరులో జాప్యం కారణంగా బైపాస్ పనులు అటకెక్కాయి. శ్రీనివాస్‌గౌడ్ ఎమ్మె ల్యే అయ్యాక బైపాస్ నిర్మాణానికి రూ.వందకోట్లు మంజూరు కాగా త్వరితగతిన పూర్తి చేశారు. ఈ బైపాస్కు అనుసంధానిస్తు మరో బైపాస్‌ను ఏర్పాటు చేస్తున్నా రు. భవిష్యత్‌లో పట్టణం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మంత్రి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గతం లో మహబూబ్‌నగర్-హైదరాబాద్ వెళ్లాలంటే 3 నుంచి మూడున్నర గంటల సమయం పట్టేది. ప్రస్తు తం బస్సుల్లో రెండుగంటల్లోనే చేరుకుంటున్నారు. కాలో అ యితే గంటన్నరలోనే వెళ్తున్నారు.
ఆర్వోబీలతో మోక్షం
పాలమూరులో అప్పన్నపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మా ణం ఏండ్ల తరబడి సాగుతున్నా నాయకులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు సగంలోనే పనులు వదిలేసి వెళ్లడంతో.. రైలు వచ్చినప్పుడల్లా వస్తే గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయేది. తెలంగాణ వచ్చిన ప్ర భుత్వం ఏడాదిలోనే ఆర్వోబీని పూర్తి చేసి ప్రజల కష్టాలకు చెక్ పెట్టింది. దేవరకద్రలోనూ ఇ దే తరహా స మస్య ఉన్నా.. రై ల్వే శాఖ పట్టించుకోకపోవడంతో ఏండ్ల తరబడి పనులు నిలిచిపోయాయి. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఆర్వోబీని మం జూరు చేయించి రెండేండ్లలోనే పూర్తి చేయడంతో ప్రయాణం సుగమమైంది.
రూ.వందల కోట్లతో ఆర్అండ్బీ రహదారుల నిర్మాణం
మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియెజక వర్గాల్లో ఎనిమిద్నిరేండ్లలో రూ.వందలకోట్లతో ఎన్నో రహదారులను నిర్మించారు. జిల్లాకేంద్రం నుం చి మండలాలకు, మండలకేంద్రాల నుంచి గ్రామాలకు ఉన్న ప్రధాన రహదారులన్నీ సింగిల్ నుంచి డబుల్‌కు మా ర్చారు. తాజాగా ప్రతి నియోజకవర్గానికి రూ. వందకోట్లు వెచ్చించి కొత్త రహదారులకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో ఎన్నోఏండ్లుగా బీటీకి నోచుకోని తండాలు, గ్రామీణ రహదారులకు మో క్షం లభించినట్లయ్యింది. దూర ప్రాంతాలకు సై తం.. ప్రయాణం సాఫీగా సాగుతుడడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాగులపై వంతెనలు
వానకాలం వస్తే చాలు వాగులు పొంగిపొర్లుతూ రాకపోకలకు ఇబ్బందులు కలిగేవి. అలాంటి ఆ వాగులు దాటుతూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ వచ్చాక ప్ర మాదకరంగా ఉన్న వాగు లపై హైలెవల్ వంతెనల ను ప్రభుత్వం యు ద్ధప్రాతిపదికన నిర్మించింది.