వడ్డేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ ( Shakti Scheme ), జీవో-97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. వడ్డేపల్లి ( Vaddepalli ) మండలం పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు చేస్తున్న నిరసనకు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య ( Kuruva Pallaiah) హాజరై సంఘీభావం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వెల్లడించారు. ఇంజినీర్లు కావలసిన విద్యార్థులను లేబర్ డిపార్ట్మెంట్లోకి తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో మోసం చేస్తూ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్‌ను శక్తి పాలసీలోకి కలపడం తీవ్రమైన అన్యాయమని అన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేకనే జీవోలను జారీ చేసిందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, నాగరాజు, రవి, రాఘవేంద్ర, ఎల్లప్ప , విద్యార్థులు వంశీ, మణికంఠ, ఠాగూర్, గోవర్ధన్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.