Illegal sand | పగలు అక్రమ ఇసుక డంపులు సీజ్..రాత్రికి మాయం
Illegal sand | అక్రమ ఇసుక దందాకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. అధికారులు పట్టుకున్న గంటల్లోనే రాత్రి వేళ్లల్లో ఇసుకు మాయం అవుతుంది.
మాగనూరు : అక్రమ ఇసుక ( Illegal sand ) దందాకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. అధికారులు పట్టుకున్న గంటల్లోనే రాత్రి వేళ్లల్లో ఇసుకు మాయం అవుతుంది. కృష్ణా పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడుమాల్ ( Mudumaal ) గ్రామంలో అధికారులు ఇసుక డంపులు పగలు సీజ్ చేస్తే రాత్రికి రాత్రి అక్రమార్కులు టిప్పర్ల ద్వారా తరలిస్తు మాయం చేస్తున్నారు.
మూడుమల్ గ్రామస్తుల వివరాల మేరకు నిత్యం రాత్రి వేళలో కృష్ణానదిలో హిటాచీలు ద్వారా ఇసుక తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో డంపులు చేస్తున్న సమాచారం సంబంధిత రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇసుక డంపుల గురించి మంగళవారం మైనింగ్ ఆర్ఐ ప్రతాపరెడ్డి జిల్లా అధికారులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు కృష్ణా మండలం వాసునగర్ మూడుమాల్ గ్రామానికి చేరుకొని పెద్ద మొత్తంలో ఇసుక డంపులు గుర్తించారు.

దాదాపు 30 ట్రిప్పర్లకు పైగా ఇసుక డంపులు గుర్తించి కృష్ణ మండల రెవెన్యూ సిబ్బంది సమక్షంలో మైనింగ్ ఆర్ ఐ ప్రతాప్ రెడ్డి సీజ్ చేశారు. అయితే వాసునగర్లో కూడా ఇసుక డంపులను సీజ్ చేయాల్సి ఉండగా వాటిని వదిలేశారు. అయితే మూడుమాల్లో సీజ్ చేసిన ఇసుకను ట్రిప్పర్ల ద్వారా ఇస్కాసురులు రాత్రికి రాత్రి మాయం చేశారు.
ఇసుక గుండెబల్లూరు టైరోడ్ హిందూపూర్ మీదుగా కర్ణాటకకు ఇసుక తరలించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అక్రమంగా ఇసుక తరలించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక రవాణా జరుగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

